గుంటూరు సబ్‌ కలెక్టర్‌ను కలిసిన ఏపీ రేషన్‌ డీలర్ల సంఘం.. పలు డిమాండ్లతో కూడిన విజ్ఞాపన పత్రం అందజేత

గుంటూరు జిల్లా తెనాలిలో సబ్ కలెక్టర్ కు ఏపీ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రం అందజేశారు. కరోనా సమయంలో

గుంటూరు సబ్‌ కలెక్టర్‌ను కలిసిన ఏపీ రేషన్‌ డీలర్ల సంఘం.. పలు డిమాండ్లతో కూడిన విజ్ఞాపన పత్రం అందజేత
Follow us
K Sammaiah

|

Updated on: Jan 30, 2021 | 11:38 PM

గుంటూరు జిల్లా తెనాలిలో సబ్ కలెక్టర్ కు ఏపీ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రం అందజేశారు. కరోనా సమయంలో డీలర్స్ కు రావలసిన కమిషన్ రాలేదని వెంటనే ఆ కమిషన్ ఇప్పించాలని కోరారు. కరోనా బారిన పడి చనిపోయిన డీలర్లకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

గతంలో ఖాళీ గోతాలు డీలర్స్ తీసుకునే అవకాశం ఉండేది. అలాంటిది ఇప్పుడు ప్రభుత్వం ఖాళీ గోతాలు తీసుకునే విధంగా జీవో నెంబర్10 తీసుకొచ్చారు. ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని డీలర్లు డిమాండ్‌ చేశారు. డీలర్స్ నాన్ పిడిఎస్ సరుకులను విక్రయించి ఆదాయం పొందే వారని, ఇప్పుడు ప్రభుత్వమే ఇంటింటికి సరుకులను అందించడం వల్ల డీలర్లు నష్టపోతారని అన్నారు.

ప్రభుత్వమే ఇంటింటికి సరుకులు సరఫరా చేయడం వల్ల డిలర్లకు ఆదాయం పడిపోతుంది. కనుక, కార్డు ఒక్కింటికి కమిషన్ తో పాటు 15 రూపాయలు అదనంగా ఇవ్వాలని డీలర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు.

AP Local Body Elections: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేసిన స్పీకర్ తమ్మినేని..