AP Local Body Elections: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేసిన స్పీకర్ తమ్మినేని..
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు క్షణ క్షణం రసవత్తరంగా మారుతుతన్నాయి. తాజాగా రాష్ట్ర ఎన్నికల..
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు క్షణ క్షణం రసవత్తరంగా మారుతుతన్నాయి. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. ఆ మేరకు శనివారం నాడు సంబంధితన నోటీసులను మెయిల్ ద్వారా నిమ్మగడ్డకు పంపించారు. తమపై ఎస్ఈసీ రమేష్ కుమార్ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల హక్కులకు భంగం కలిగిస్తూ వ్యాఖ్యలు చేసిన ఎస్ఈసీపై చర్యలు తీసుకోవాలంటూ మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స ఇద్దరూ కలిసి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఈసీ రమేష్ కుమార్.. గవర్నర్‌కి లేఖ రాసి, దానిని మీడియాకి లీక్ చేసి తమ ప్రతిష్టకు భంగం కలిగించారని మంత్రులిద్దరూ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారం.. ఎస్ఈసీకి నోటీసులు పంపించారు. దీనిపై ఎస్ఈసీ స్పందనను బట్టి స్పీకర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలాఉండగా, ఎస్ఈసీ తీరుపై గవర్నర్ హరిచందన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు.. ప్రివిలేజ్ కమిటీ దృష్టికి కూడా తీసుకెళ్లాలని మంత్రులు భావిస్తున్నారు.
Also read:
టీకా లబ్ధిదారుల సంఖ్యను పెంచండి.. కోవిడ్ టీకా పంపిణీపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు..
సాక్షాత్తూ ప్రధాని మోదీ ప్రకటన, రైతులతో ఇకపై చర్చలు ఉండబోవని ప్రకటించి, కాస్త వెనక్కి తగ్గిన కేంద్రం