కేసీఆర్‌కు జగన్ దత్తపుత్రుడు: బుద్దా వెంకన్న

విజయవాడ: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జగన్ దత్తపుత్రుడని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. అమరావతిలో ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్, మోడీలపై విమర్శల వర్షం కురింపించారు. పారిశ్రామిక వేత్తలంతా దోచుకోవడానికే జగన్ పార్టీలోకి వెళుతున్నారని విమర్శించారు. జగన్ ఓటును తొలగించేందుకు ఫామ్-7 ఇచ్చారన్నది వాస్తవం కాదని, ఆయన పాస్‌పోర్టులో అడ్రస్ ఏముందో చూడాలని వెంకన్న అన్నారు. జగన్‌ను కాపాడాలని సీబీఐకి ప్రధాని మోడీ నుంచి ఆదేశాలు అందాయని ఆరోపించారు. జగన్ నుంచి […]

కేసీఆర్‌కు జగన్ దత్తపుత్రుడు: బుద్దా వెంకన్న
Follow us
Vijay K

|

Updated on: Mar 13, 2019 | 4:50 PM

విజయవాడ: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జగన్ దత్తపుత్రుడని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. అమరావతిలో ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్, మోడీలపై విమర్శల వర్షం కురింపించారు. పారిశ్రామిక వేత్తలంతా దోచుకోవడానికే జగన్ పార్టీలోకి వెళుతున్నారని విమర్శించారు.

జగన్ ఓటును తొలగించేందుకు ఫామ్-7 ఇచ్చారన్నది వాస్తవం కాదని, ఆయన పాస్‌పోర్టులో అడ్రస్ ఏముందో చూడాలని వెంకన్న అన్నారు. జగన్‌ను కాపాడాలని సీబీఐకి ప్రధాని మోడీ నుంచి ఆదేశాలు అందాయని ఆరోపించారు. జగన్ నుంచి మోడీకి ఎంత ముడుపులు అందాయో చెప్పాలని డిమాండ్ చేశారు.