మోదీ తరువాత ఎవరు..? ప్రత్యామ్నాయం ఉన్నారా..!
దేశమంతా లోక్‌సభ ఎన్నికల వేడి కొనసాగుతోంది. మొదటి విడతలో 90 నియోజకవర్గాలకు పోలింగ్ కూడా ముగిసింది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ రాదని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రధానమంత్రిగా మోదీకి ఎవరు ప్రత్యామ్నాయం అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2004-14వరకు యూపీఏ హయాంలో జరిగిన అవినీతి కారణంగా దేశ వ్యాప్తంగా ఆ కూటమిపై వ్యతిరేకత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే 2014లో అందరూ మోదీవైపు చూశారు. ఆ తరువాత అధికారంలోకి […]

దేశమంతా లోక్‌సభ ఎన్నికల వేడి కొనసాగుతోంది. మొదటి విడతలో 90 నియోజకవర్గాలకు పోలింగ్ కూడా ముగిసింది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ రాదని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రధానమంత్రిగా మోదీకి ఎవరు ప్రత్యామ్నాయం అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
2004-14వరకు యూపీఏ హయాంలో జరిగిన అవినీతి కారణంగా దేశ వ్యాప్తంగా ఆ కూటమిపై వ్యతిరేకత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే 2014లో అందరూ మోదీవైపు చూశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన మోదీ అందరూ ఊహించినట్లుగా పాలన చేయలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. పక్కా ప్రణాళికలు లేకుండా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు.. ప్రజలకు మేలు చేయడం కంటే వారిని కష్టాలపాలు చేశాయన్నది వారి అభిప్రాయం. అయినా ఈ ఐదేళ్లతో మోదీ అద్భుతాలు చేయడంలో విఫలమైనప్పటికీ.. పలు వర్గాలు ఆయన పాలనపై సంతృప్తిని వ్యక్తపరుస్తున్నారని అంటున్నవారు లేకపోలేదు. అయితే ఈ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని బీజేపీ మేజిక్ ఫిగర్ సాధిస్తుందా అన్నది మిలియన్ డాలర్ల క్వశ్చన్.
ఏమైనా మోదీ తరువాత ఆ పదవికి ప్రత్యామ్నాయం ఎవరు అన్నది చర్చ జరుగుతోంది. ప్రధాని స్థానాన్ని ఎవరు సమర్థవంతంగా నడిపించగలరన్న ప్రశ్న అందరిలో తొలుస్తోంది. మోదీకి వ్యతిరేకంగా ఏర్పడ్డ రాష్ట్రీయ పార్టీల్లో ఈ పదవిని ఆశిస్తున్న వారు చాలామందే ఉన్నారు. వారందరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ప్రధాని అభ్యర్థిగా వారు దేశ ప్రజలలో నమ్మకాన్ని కలిగించకపోయారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పట్ల ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడంలో విఫలమయ్యారు. కాంగ్రెస్‌లో సీనియర్ నేతలైన సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ రిటైర్మెంట్ వయస్సుకు దగ్గరగా రాగా.. ప్రియాంక గాంధీ నాయకురాలిగా తానేంటో నిరూపించుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మోదీకి ప్రత్యామ్నాయంగా ఇప్పట్లో ఎవరూ కనిపించడం లేదు. ఇది రాజకీయ విశ్లేషకుల తాజా అంచనా.