మేనకా గాంధీ, ఆజంఖాన్‌‌లపై ఈసీ కొరడా!

కేంద్ర మంత్రి మేనకా గాంధీ 48 గంటలు, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజంఖాన్‌ను 72 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు మంగళవారం ఉదయం 10 గంటల నుండి అమలులోకివస్తాయి. ఏప్రిల్ 11 న ఉత్తరప్రదేశ్ సుల్తాన్‌పూర్‌లో ముస్లిం ఓటర్లను బెదిరిస్తున్నట్లు ఒక ర్యాలీ సందర్భంగా మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తనకు ముస్లిములు ఓటు వేయకపోతే వారి అభివృద్ధికి కృషి చేయబోనని అంటూనే తాను గెలుస్తాను కాని […]

మేనకా గాంధీ, ఆజంఖాన్‌‌లపై ఈసీ కొరడా!

కేంద్ర మంత్రి మేనకా గాంధీ 48 గంటలు, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజంఖాన్‌ను 72 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు మంగళవారం ఉదయం 10 గంటల నుండి అమలులోకివస్తాయి.

ఏప్రిల్ 11 న ఉత్తరప్రదేశ్ సుల్తాన్‌పూర్‌లో ముస్లిం ఓటర్లను బెదిరిస్తున్నట్లు ఒక ర్యాలీ సందర్భంగా మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తనకు ముస్లిములు ఓటు వేయకపోతే వారి అభివృద్ధికి కృషి చేయబోనని అంటూనే తాను గెలుస్తాను కాని నా విజయంలో ముస్లింలు లేనట్లయితే, నాకు తృప్తి లేదని ఆమె అన్నారు.

మరోవైపు, రాంపూర్ నుంచి బీజేపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటి జయప్రదను ఉద్దేశించి సమాజ్ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ గతంలోలాగే అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాజాగా మేనకా గాంధీ వ్యాఖ్యలపై కూడా ఈసీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమె ప్రచారంపై ఆంక్షలు విధించింది.

Click on your DTH Provider to Add TV9 Telugu