ఇండియా అంటే..ఈ ‘ వికాస్ పతియే ‘!
ప్రెసిడెన్షియల్ (కాబోయే) ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మళ్ళీ ‘ రైసినా హిల్స్ ‘ (పదవి) వైపు అడుగులు వేస్తున్నారు. ఆయన పర్మనెంట్ ఎలక్షన్ మోడ్ ఎలా ఉందంటే.. 543 లోక్ సభ నియోజకవర్గాలనూ ఒకే జాతీయ నియోజకవర్గంగా, పార్లమెంట్ ఎన్నికలను ‘ ప్రెసిడెన్షియల్ రెఫరెండం ‘ గా మార్చివేసినట్టే ఉంది. ఇక ‘ దూకుడైన ‘ హిందూత్వ స్థాపన విషయంలో ఆయన ఆలోచనలను దేశ ప్రజలు ప్రజలు సమర్థించినట్టే. ఇది బీజేపీకి మంచి ప్రయోజనకారిగా పరిణమించింది. […]
ప్రెసిడెన్షియల్ (కాబోయే) ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మళ్ళీ ‘ రైసినా హిల్స్ ‘ (పదవి) వైపు అడుగులు వేస్తున్నారు. ఆయన పర్మనెంట్ ఎలక్షన్ మోడ్ ఎలా ఉందంటే.. 543 లోక్ సభ నియోజకవర్గాలనూ ఒకే జాతీయ నియోజకవర్గంగా, పార్లమెంట్ ఎన్నికలను ‘ ప్రెసిడెన్షియల్ రెఫరెండం ‘ గా మార్చివేసినట్టే ఉంది. ఇక ‘ దూకుడైన ‘ హిందూత్వ స్థాపన విషయంలో ఆయన ఆలోచనలను దేశ ప్రజలు ప్రజలు సమర్థించినట్టే. ఇది బీజేపీకి మంచి ప్రయోజనకారిగా పరిణమించింది. తాజా ఎన్నికల ఫలితాలు ముఖ్యంగా మూడు అంశాలను హైలైట్ చేస్తున్నాయి. అవి..’ మస్క్యు లర్ నియో-హిందూయిజం,’ (బలమైన హిందూత్వ), మీడియా మైథాలజీస్ (సోషల్ మీడియా), హోల్ సేల్ వర్సెస్ రిటెయిల్ పాలిటిక్స్ (రాజకీయాల్లో వ్యాపార పోకడ ప్రచారం) అని ఓ వ్యాసకర్త పేర్కొన్నారు. నియో హిందూయిజం గురించి ప్రస్తావించవలసి వస్తే,, ఇది దేశంలోని, విదేశీ శత్రువులు హిందూ మెజారిటీకి హాని కల్పిస్తున్నారన్న అభిప్రాయాన్ని మోదీ ప్రజల్లో బలంగా కలిగించగలిగారు. ఇండియాలోని ప్లూరాలిటీ, డైవర్సిటీ (బహుళ వ్యవస్థలు), సెక్యులరిజాన్ని ఒక విధంగా ఆయన సవాల్ చేశారు. అయోధ్య సమస్య, హిందూత్వ నినాదం ప్రధానంగా వారణాసిలో మోదీని ‘ అగ్ర భాగాన ‘ నిలిపాయి. రాజకీయంగా ఇలాంటివి ఆయనకు దోహదపడ్డాయి. మీడియా మైథాలజీ అంటే..నమో టీవీయే కాదు.. సోషల్ మీడియా, వాట్సాప్ సందేశాలు మోదీ నాయకత్వానికి ఉపయోగపడ్డాయి. ‘ మన్ కీ బాత్ ‘ షో ఆయనను ప్రజలను దగ్గర చేసింది. సర్జికల్ దాడులను ఆయన మద్దతుదారులు సైకాలజికల్ రిలీఫ్ గా భావిస్తే.. పబ్లిక్, ప్రైవేట్ మీడియాతో బాటు అగ్రవర్ణాలు, బీసీలు, దళితులు బీజేపీకి పట్టం గట్టడం విశేషం. హోల్ సేల్ వర్సెస్ రిటెయిల్ పాలిటిక్స్ అంటే.. సరదాగా.. ‘ తండా మత్లబ్ కోకో కోలా ‘ అంటూ నటుడు ఆమిర్ ఖాన్ తో కూడిన యాడ్ కు సంబంధింఛిన మార్కెటింగ్ స్ట్రాటెజీని మోదీ పాటించడం.. తను రోజుకు 20 గంటలు పని చేస్తానని, నాలుగు గంటలే నిద్రపోతానని ఆయన చేసిన ప్రచారం నిజమైనా, కాకపోయినా దాన్ని ప్రజలు విశ్వసించారు. కాగా-కాంగ్రెస్ తన ప్రచారాన్ని నెగెటివ్ పొలిటికల్ మార్కెటింగ్ తో మొదలు పెట్టింది. ఆ పార్టీ చేసిన ప్రచారం దాని విజయానికి దోహదపడలేదు.