AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్‌కు ఉన్న కసి అంటే నాకిష్టం : ప్రముఖ డైరెక్టర్

హైదరాబాద్: ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్ లాంటి వ్యక్తి, జగన్ లాంటి శక్తి మనకు కావాలని అన్నారు. ప్రజల కోసం జగన్ కంకణం కట్టుకుని, కసిగా తిరుగుతున్నాడని, అతని కసి, అతని వ్యక్తిత్వం తనకు ఇష్టమని చెప్పారు. జగన్‌కు అలసట ఉండదా? ఉదయం నుంచి రాత్రి వరకు పాదయాత్రలో తిరగడం మామూలు విషయం కాదు. అంత ఎండలో ఎందుకు తిరిగాడు, ఎవరి కోసం తిరిగాడు? అని ప్రశ్నించారు. ఈ యాత్రలో ఎన్నో […]

జగన్‌కు ఉన్న కసి అంటే నాకిష్టం : ప్రముఖ డైరెక్టర్
Vijay K
| Edited By: |

Updated on: Apr 02, 2019 | 7:44 AM

Share

హైదరాబాద్: ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్ లాంటి వ్యక్తి, జగన్ లాంటి శక్తి మనకు కావాలని అన్నారు. ప్రజల కోసం జగన్ కంకణం కట్టుకుని, కసిగా తిరుగుతున్నాడని, అతని కసి, అతని వ్యక్తిత్వం తనకు ఇష్టమని చెప్పారు.

జగన్‌కు అలసట ఉండదా? ఉదయం నుంచి రాత్రి వరకు పాదయాత్రలో తిరగడం మామూలు విషయం కాదు. అంత ఎండలో ఎందుకు తిరిగాడు, ఎవరి కోసం తిరిగాడు? అని ప్రశ్నించారు. ఈ యాత్రలో ఎన్నో సమస్యలు తెలుసుకుని నవరత్నాల పేరుతో ప్రజల కోసం మంచి పథకాలు తెచ్చారని అన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తి జగన్. ఇలాంటి వ్యక్తి రేపు అధికారంలోకి వస్తే సమాజం బాగుపడుతుంది, చదువుకునే పిల్లలు బాగుపడతారు, అనారోగ్యంతో బాధపడేవారు బాగుపడతారని చెప్పారు.

ఒకసారి జగన్‌తో కలిసి నడిచినప్పుడు ఆయన ప్రజలపై చూపించిన ప్రేమకు తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని అన్నారు. 50 ఏళ్ల ఏపీ భవిష్యత్తును రేపు రాబోతున్న ఐదేళ్లలో మనం చూడవచ్చు. జగన్ అంటే ఏంటో రేపు ఆయన పరిపాలిస్తున్నప్పుడు తెలుస్తుందని ఎస్వీ కృష్ణా రెడ్డి చెప్పారు.