నిజామాబాద్‍లో భారీ ఈవీఎంలతో ఎన్నికలు!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్‌ పార్లమెంటు స్థానంలో పోలింగ్‌ నిర్వహణపై సందిగ్ధ‌తకు ఈసీ తెరదించింది. ఈవీఎంలతోనే పోలింగ్‌ నిర్వహించనున్నట్టు స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించింది. దీంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తమ సమస్యలను జాతీయస్థాయిలో ప్రతిబింబించడానికి పసుపు, ఎర్రజొన్న రైతులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలతో సహా 185 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు […]

నిజామాబాద్‍లో భారీ ఈవీఎంలతో ఎన్నికలు!
Follow us

| Edited By:

Updated on: Apr 01, 2019 | 9:28 AM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్‌ పార్లమెంటు స్థానంలో పోలింగ్‌ నిర్వహణపై సందిగ్ధ‌తకు ఈసీ తెరదించింది. ఈవీఎంలతోనే పోలింగ్‌ నిర్వహించనున్నట్టు స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించింది. దీంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తమ సమస్యలను జాతీయస్థాయిలో ప్రతిబింబించడానికి పసుపు, ఎర్రజొన్న రైతులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలతో సహా 185 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలవడంతో బ్యాలెట్‌ ఉపయోగించాలా? ఈవీఎంల ద్వారా పోలింగ్‌ సాధ్యమేనా అన్న విషయంపై ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేసింది. ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహిస్తే ఏమైనా సమస్యలు వస్తాయా అనే కోణంలోనూ చర్చించారు. చివరికి ఎం-3 రకం ఈవీఎంలను వినియోగించాలని నిర్ణయించారు.

భెల్(BHEL) తయారు చేసిన ఈ ఎం-3 రకం ఈవీఎంల‌లో 383 మంది వరకు పోటీలో ఉన్నా పోలింగ్‌ సాధ్యమవుతుంది. ఇవి ఈసీ దగ్గర ఉన్నా ఇప్పటికే పలు నియోజకవర్గాలకు తరలించారు. మరోవైపు, ఈసీఐఎల్(ECIL) కూడా ఎం-3 యూనిట్లను తయారు చేస్తోంది. దీంతో ఆ యూనిట్లను సరఫరా చేయాల్సిందిగా ఆ సంస్థను ఎన్నికల సంఘం కోరింది. నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో మొత్తం 26,820 బ్యాలెట్‌ యూనిట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. అలాగే 2,240 కంట్రోల్‌ యూనిట్లు, 2,600 వీవీప్యాట్‌‌లను వినియోగించనున్నట్లు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ వెల్లడించారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.