హఠాత్తుగా మెట్రో రైలులో కనిపించిన హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీ.. అధికారులకు కీలక ఆదేశాలు

హైదరాబాద్‌ మేయర్ మెట్రో రైలులో సందడి చేశారు. మూసారంబాగ్ నుంచి ఎల్బీనగర్‌ వరకు మెట్రోలో ప్రయాణించారు. మెట్రోలోని ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

హఠాత్తుగా మెట్రో రైలులో కనిపించిన హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీ.. అధికారులకు కీలక ఆదేశాలు
Hyderabad Mayor Vijayalakshmi
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 15, 2024 | 3:01 PM

హైదరాబాద్‌ మేయర్ మెట్రో రైలులో సందడి చేశారు. మూసారంబాగ్ నుంచి ఎల్బీనగర్‌ వరకు మెట్రోలో ప్రయాణించారు. మెట్రోలోని ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మూసారంబాగ్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో ట్రైన్ లో ప్రయాణించారు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ. గణేష్ నిమజ్జనం కోసం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక మెట్రో రైల్ సర్వీసుల పొడిగింపుపై మేయర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో కలిసి మేయర్ మెట్రో రైలులో ప్రయాణించారు.

ఇంకా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రైన్స్, నిమర్జనం రోజు మెట్రో సమయం పెంపుపై మెట్రో అధికారులకు మేయర్ కీలక ఆదేశాలు ఇచ్చారు. భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు కొన్ని సూచనలు చేశారు. మెట్రోలో ప్రయాణం చేస్తూ ప్రయాణికులతో మాట్లాడి మెట్రో సేవలు సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సూచనలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని మెట్రో అధికారులకు సూచించారు. మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు.

వీడియో చూడండి…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేేయండి..