హర్యానాలో బీజేపీ, జేజేపీలదే ఇక ‘ ఉమ్మడి ప్రభుత్వం’

హర్యానాలో బీజేపీ, జేజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. తాము దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో కలిసి సర్కార్ ని ఏర్పాటు చేస్తామని బీజేపీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ 40 స్థానాలను, జేజేపీ 10 సీట్లను గెలుచుకున్నాయి. ప్రజలు ఇఛ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుని ఈ రాష్ట్రంలో తమ రెండు పార్టీలూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నేతలు నిర్ణయించారని ఆయన చెప్పారు. […]

హర్యానాలో బీజేపీ, జేజేపీలదే ఇక ' ఉమ్మడి ప్రభుత్వం'
Follow us
Anil kumar poka

|

Updated on: Oct 26, 2019 | 2:40 PM

హర్యానాలో బీజేపీ, జేజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. తాము దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో కలిసి సర్కార్ ని ఏర్పాటు చేస్తామని బీజేపీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ 40 స్థానాలను, జేజేపీ 10 సీట్లను గెలుచుకున్నాయి. ప్రజలు ఇఛ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుని ఈ రాష్ట్రంలో తమ రెండు పార్టీలూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నేతలు నిర్ణయించారని ఆయన చెప్పారు. మా పార్టీ నేత ముఖ్యమంత్రి అవుతారు. అలాగే జేజేపీకి డిప్యూటీ సీఎం పదవిని ఇస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, దుష్యంత్ చౌతాలా కలిసి పాల్గొన్న కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాగా-చండీగఢ్ లో నేడు జరిగిన  సమావేశంలో సీఎం ఖట్టర్ బీజేపీ లెజిస్లేటివ్ నేతగా ఎన్నికయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనను ఆహ్వానించవలసిందిగా ఆయన గవర్నర్ ని కోరవచ్చు. ఆయన ఆదివారం సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి.

ఇక 31ఏళ్ళ దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సిఎం కావచ్ఛునని భావిస్తున్నారు. హర్యానాలో సుస్థిరత కోసం బీజేపీతో పొత్తు తప్పనిసరి అయిందని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీ-ఏదీ అంటరానిది కాదు కదా అన్నారు. అటు కమలం పార్టీకి సాధారణ మెజారిటీ కావాలంటే ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేలు అవసరమవుతారు. ఈ నేపథ్యంలో ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులపై ఈ పార్టీ దృష్టి పెట్టింది. వీరిలో అత్యంత వివాదాస్పదుడైన గోపాల్ కందా ఉన్నారు. ఆయనకు ఉన్న క్రిమినల్ రికార్డు దృష్ట్యా ఆయనను బీజేపీ దూరం పెట్టింది. 2012 లో తన ఏవియేషన్ కంపెనీలో పని చేసే ఓ యువతిని సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించాడన్న ఆరోణపలు ఆయనపై ఉన్నాయి. అటు 31 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా జేజేపీ వైపు మొగ్గు చూపింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే జేజేపీ మద్దతు మాత్రమే చాలదన్న విషయం ఈ పార్టీకి తెలుసు. అందువల్లే వెనక్కి తగ్గింది. హర్యానాలో తమ పార్టీ విజయాన్ని ఊహించనిదిగా సాక్షాత్తూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.