ప్రజలారా.. ఒక్కసారి జగన్‌కు అవకాశం ఇవ్వండి: మోహన్ బాబు

చంద్రబాబుపై మోహన్ బాబు నిప్పులు. దొరకనివాడు దొర.. నువ్వు దొరకలేదంతే.. చంద్రబాబు పార్టీ ఫినీష్. జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి. విజయవాడ: ఇటీవలే వైసీపీలో చేరిన ప్రముఖ నటులు మోహన్ బాబు విజయవాడ వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తూ జగన్‌కు ఒక్క అవకాశమివ్వమని కోరారు. చంద్రబాబుపై మోహన్ బాబు నిప్పులు ఎదుటివాడు బాగుంటే ఓర్వలేని మనస్తత్వం చంద్రబాబుది. అసలు చంద్రబాబుకు క్యారెక్టర్ లేదు. జగన్‌పై కేసులు పెట్టించింది చంద్రబాబే అంటూ బాబుపై […]

  • Vijay K
  • Publish Date - 5:56 pm, Sat, 30 March 19
ప్రజలారా.. ఒక్కసారి జగన్‌కు అవకాశం ఇవ్వండి: మోహన్ బాబు
  • చంద్రబాబుపై మోహన్ బాబు నిప్పులు.
  • దొరకనివాడు దొర.. నువ్వు దొరకలేదంతే..
  • చంద్రబాబు పార్టీ ఫినీష్.
  • జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి.

విజయవాడ: ఇటీవలే వైసీపీలో చేరిన ప్రముఖ నటులు మోహన్ బాబు విజయవాడ వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తూ జగన్‌కు ఒక్క అవకాశమివ్వమని కోరారు.

చంద్రబాబుపై మోహన్ బాబు నిప్పులు
ఎదుటివాడు బాగుంటే ఓర్వలేని మనస్తత్వం చంద్రబాబుది. అసలు చంద్రబాబుకు క్యారెక్టర్ లేదు. జగన్‌పై కేసులు పెట్టించింది చంద్రబాబే అంటూ బాబుపై మోహన్ బాబు నిప్పులు చెరిగారు. మహానటుడు ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశాన్ని లాక్కున్నావు. నీ మాయలో పడి ఏదో జరుగుతుందని నీ వెంట వస్తే, మరురోజు తెలిసింది నువ్వు ఇలాగా అని, తర్వాత అందుకు నా తప్పును ఒప్పుకున్నాను అని మోహన్ బాబు అన్నారు.

జగన్ సొంతగా వైసీపీ స్థాపించాడు. అది అతని సొంతం. పది సంవత్సరాల నుంచి ఏకధాటిగా నడుస్తున్నాడు. నీకు సొంత పార్టీ లేదు, నీ పునాది కాంగ్రెస్, ఎన్టీఆర్ గారి మీద పోటీ చేస్తానని చెప్పిన వ్యక్తివి నువ్వు. తెలుగుదేశం పార్టీ నీది కాదు. ఎన్టీఆర్ పెట్టుకున్న నిండు ఇస్తరిని నువ్వు రాత్రికి రాత్రి లాక్కున్నావు అంటూ మోహన్ బాబు తీవ్ర విమర్శలు చేశారు.

దొరకనివాడు దొర.. నువ్వు దొరకలేదంతే..
క్యారెక్టర్ లేదని జగన్‌ను అంటావు, అసలు ముందు నీకు క్యారెక్టర్ ఉందా? అని ప్రశ్నించారు. దొరికేవాడు దొంగ, దొరకనివాడు దొర. నువ్వు దొరకలా.. తెలుగు ప్రజలు నువ్వు కావాలని కోరుకోలేదు. అన్నయ్య మీద ప్రేమతోనే ప్రజలు టీడీపీని ఆదరించారు. అన్నయ్యగారికి విరోధి అయిన కాంగ్రెస్‌ను సంకన పెట్టుకున్నావ్. జగన్‌ది ఒకటే పదం, ప్రత్యేక హోదా కావాలన్నాడు. నువ్వు మాత్రం హోదా లేకపోయినా పర్వాలేదు, ప్యాకేజీ అన్నావు.

చంద్రబాబు పార్టీ ఫినీష్
దోచుకోవడానికి ఏమీ లేదన్నంతగా దోచుకున్నావు. చంద్రబాబు పార్టీ ఫినీష్. చంద్రబాబు లేడు. చంద్రబాబు వద్దు అని మోహన్ బాబు అన్నారు. అన్నగారి కుటుంబం చాలా అమాయకులు కాబట్టే చంద్రబాబు మోసం చేయగలిగాడు. చంద్రబాబు మాటలు నమ్మినవాడు నట్టేట మునిగినట్టే. అతనివి అసత్య ప్రచారాలు, నిజాలు లేవు. ఈ రోజు ఒక మాట, రేపు మరో మాట అంటూ మోహన్ బాబు తీవ్ర విమర్శలు చేశారు.

వైఎస్సార్ పోలవరం గురించి మాట్లాడితే అవహేళన చేశావ్. ఇప్పుడు పోలవరం జపం చేస్తున్నావ్. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి లెక్కలు చెప్పమంటే చెప్పడంలేదు. నువ్వు నిధులు దోచేసిన దొంగవు అంటూ మోహన్ బాబు విరుచుకుపడ్డారు.

జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి
ప్రజలకు మేలు చేసేందుకే జగన్ వస్తున్నాడు. ఎన్నో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం సాధ్యమా? ప్రజలారా ఒక్కసారి జగన్ మోహన్ రెడ్డికి అవకాశమివ్వండి. అతను నిరూపించుకుంటాడు అంటూ మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు.