ఢిల్లీ ఎంపీ బరిలో గంభీర్..!
భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ రాజకీయాల్లో బిజీ అవ్వనున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన గంభీర్.. బీజేపీ తరపున ఢిల్లీ నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఆయన అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు గంభీర్‌ను రంగంలోకి దింపితే ఎలాంటి ఫలితం ఉంటుందన్న అంశంపై బీజేపీ కూడా లెక్కలుకడుతోంది. అతని పేరుపై తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ మీనాక్షి లేఖికి వేరొక స్థానాన్ని కేటాయించే అవకాశాలు […]

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ రాజకీయాల్లో బిజీ అవ్వనున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన గంభీర్.. బీజేపీ తరపున ఢిల్లీ నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఆయన అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు గంభీర్‌ను రంగంలోకి దింపితే ఎలాంటి ఫలితం ఉంటుందన్న అంశంపై బీజేపీ కూడా లెక్కలుకడుతోంది. అతని పేరుపై తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ మీనాక్షి లేఖికి వేరొక స్థానాన్ని కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.




