తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కరోనా ఎఫెక్ట్.. అయినా భారీ బడ్జెట్‌.. ఏయే శాఖకు ఎంతెంత కేటాయించారంటే..

|

Mar 18, 2021 | 2:04 PM

Telangana Budget: తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర‌ ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్ రావు బడ్జెట్ ప్ర‌వేశపెట్టారు. రూ.2,30,825 కోట్లతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ అంచనాలను..

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కరోనా ఎఫెక్ట్.. అయినా భారీ బడ్జెట్‌.. ఏయే శాఖకు ఎంతెంత కేటాయించారంటే..
Ts Panchayath Budget
Follow us on

Telangana Budget: తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర‌ ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్ రావు బడ్జెట్ ప్ర‌వేశపెట్టారు. రూ.2,30,825 కోట్లతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ అంచనాలను రూపొందించారు. రెవెన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లుగా పేర్కొన్నారు. ఏడేళ్ల తెలంగాణ అనేక రాష్ట్రాలను ప్రగతి పథంలో అధిగమించిందని ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు తన ప్రసంగంలో వివరించారు.

ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. నిర్దేశిత లక్ష్యాలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తున్నాం. సమస్యలు, సవాళ్లు అధిగమిస్తూ ప్రగతిపధాన పయనిస్తున్నాం. గురుతర బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు అని హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల ఆశలు, ఆకాంక్ష‌ల‌కు త‌గ్గ‌ట్లుగా బ‌డ్జెట్ రూపొందించామని చెప్పారు. ఆర్థిక లోటు అంచ‌నా రూ.45,509.60 కోట్ల‌ని, మూల‌ధ‌న వ్య‌యం రూ.29,046.77 కోట్లు అని తెలిపారు. పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌కు రూ.29,271 కోట్ల కేటాయింపులు చేస్తున్న‌ట్లు చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు రూ.5 కోట్ల చొప్పున నియోజ‌క వ‌ర్గాల‌ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు మొత్తం క‌లిపి రూ.800 కోట్లు కేటాయిస్తున్న‌ట్లు వివ‌రించారు.

ముఖ్య‌మంత్రి ద‌ళిత్ సాధికార‌త‌కు రూ.1,000 కోట్లు ఇస్తున్న‌ట్లు చెప్పారు. వ్య‌వ‌సాయ రంగంలో యాంత్రీక‌ర‌ణ కోసం రూ.1,500 కోట్లు కేటాయిస్తున్నామ‌న్నారు. క‌రోనా కార‌ణంగా ఎన్నో ఆర్థిక‌, ఆరోగ్య స‌వాళ్ల‌ను ఎదుర్కొన్నామ‌ని చెప్పారు. జీఎస్‌డీపీ భారీగా త‌గ్గింద‌ని తెలిపారు.

బడ్జెట్‌లో కేటాయింపుల వివరాలు

ఆర్థిక లోటు అంచనా రూ.45,509.60 కోట్లు.
మూలధన వ్యయం రూ.29,046.77 కోట్లు.
పెట్టుబడి వ్యయం రూ.29,046.77 కోట్లు.
రెవెన్యూ మిగులు రూ.6,743.50 కోట్లు.
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ- రూ.29,271 కోట్లు.
సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ -రూ. వెయ్యి కోట్లు.
ఎంబీసీ కార్పొరేష‌న్ కు రూ.1,000 కోట్లు
బీసీ సంక్షేమ శాఖ‌కు రూ.5,522 కోట్లు
మైనార్టీ సంక్షేమ శాఖ‌కు రూ.1,606 కోట్లు
మ‌హిళ‌ల‌కు వ‌డ్డీలేని రుణాల కోసం రూ.3,000 కోట్లు
మ‌హిళ‌, శిశు సంక్షేమ శాఖ‌కు రూ.1,702 కోట్లు
రైతు బంధుకు రూ.14,800 కోట్లు
రైతుల రుణ‌మాఫీకి రూ.5,225 కోట్లు
వ్య‌వ‌సాయ శాఖ‌కు రూ.25 వేల కోట్లు
ప‌శు సంవ‌ర్థ‌క శాఖ‌కు రూ.1,730 కోట్లు
నీటి పారుద‌ల శాఖ‌కు రూ.16,931 కోట్లు
స‌మ‌గ్ర భూస‌ర్వేకు రూ.400 కోట్లు
ఆస‌రా పింఛ‌న్ల‌కు రూ.11,728 కోట్లు
క‌ల్యాణ ల‌క్ష్మి, షాదీ ముబార‌క్‌కు రూ.2,750 కోట్లు
ఎస్సీ ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధికి రూ.21,306.85 కోట్లు
ఎస్టీల ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధికి రూ.12,304.23 కోట్లు
ఎస్టీ గృహాల‌కు రాయితీపై విద్యుత్ కు రూ.18 కోట్లు
మూడు ల‌క్ష‌ల గొర్రెల యూనిట్ల కోసం రూ.3,000 కోట్లు
బీసీల‌కు క‌ల్యాణ‌ల‌క్ష్మికి అద‌నంగా రూ.500 కోట్లు
రైతుల సంక్షేమం కోసం రూ.338 కోట్లు
కొత్త స‌చివాల‌య నిర్మాణానికి రూ.610 కోట్లు
దేవాదాయ శాఖ‌కు రూ.720 కోట్లు
అట‌వీ శాఖ‌కు రూ.1,276 కోట్లు
ఆర్టీసీకి రూ.1,500 కోట్లు
మెట్రో రైలుకు రూ.1,000 కోట్లు
ఓఆర్ఆర్ లోప‌ల కొత్త కాల‌నీల్లో తాగునీరు కోసం రూ.250 కోట్లు
వరంగ‌ల్ కార్పొరేష‌న్‌కు రూ.250 కోట్లు
ఖ‌మ్మం కార్పొరేష‌న్‌కు రూ.150 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ.2,363 కోట్లు
రీజినల్‌ రింగ్‌రోడ్డు భూ సేకరణకు రూ.750 కోట్లు
ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృధ్ధి నిధుల కోసం రూ.800 కోట్లు
డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం కోసం రూ.11వేల కోట్లు
మూసీ నది అభివృద్ధికి రూ.200 కోట్లు

Read More: టీఆర్‌ఎస్‌ వైపే నిలిచిన పట్టభద్రులు.. తెలంగాణలో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన గులాబీ దళం

మూడోరౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యం నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్డేట్..