AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబుకు ఊహించని షాక్‌.. కీలక నేత సడన్‌ రాజీనామా..!

గత కొన్ని రోజులుగా రాజకీయంగా గడ్డుకాలం ఎదర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఆయన సొంత జిల్లా చిత్తూరులో కీలకంగా ఉన్న నేత,

చంద్రబాబుకు ఊహించని షాక్‌.. కీలక నేత సడన్‌ రాజీనామా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 04, 2020 | 9:42 PM

Share

గత కొన్ని రోజులుగా రాజకీయంగా గడ్డుకాలం ఎదర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఆయన సొంత జిల్లా చిత్తూరులో కీలకంగా ఉన్న నేత, మాజీ ఎమ్మెల్యే సడన్‌గా పార్టీకి రాజీనామా చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పనిచేస్తూ వచ్చిన ఏఎస్ మనోహర్.. ఉన్నట్లుండి తన రాజీనామాను ప్రకటించారు. అంతేకాదు గురువారం తన రాజీనామా లేఖను చంద్రబాబు నాయుడుకు కూడా పంపారు.

ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ.. కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని, ఆ తరువాత వేరే పార్టీలో చేరడంపై నిర్ణయాన్ని ప్రకటిస్తానని అన్నారు. కాగా 1994 నుంచి టీడీపీలో కొనసాగుతున్న మనోహర్.. ఆ ఏడాది అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సీకే బాబు చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత 1999లోనూ టీడీపీ తరఫున పోటీ చేసిన ఆయన.. ఆ సంవత్సరం కూడా ఓటమి పాలయ్యారు. 2004లో మనోహర్ గెలిచినప్పటికీ.. టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. ఇక 2013లో వైసీపీలో చేరిన ఆయనకు 2014లో జగన్ పార్టీ టికెట్‌ను ఇవ్వలేదు. ఈ క్రమంలో 2019 ఎన్నికల ముందు మళ్లీ సొంతగూడు టీడీపీలోకి వెళ్లారు మనోహర్. అయితే గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లోనూ ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ.. మొన్న జరిగిన మహానాడు వరకు టీడీపీ పార్టీ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించిన మనోహర్.. సడన్‌గా రాజీనామా చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఈ మాజీ ఎమ్మెల్యే త్వరలో వైసీపీలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read This Story Also: కరెక్షన్లు చేసిన లెక్కల మాస్టార్‌.. మెగాస్టార్ ముందుకు ‘ఉప్పెన’..!

Follow Us