సీనియారిటీ ప్రాతిపదికన నియామకాలు, బదిలీలు చేపట్టడానికి తీసుకొచ్చిన జీవో 371పై రాజ్ భవన్ ముందు ఏర్పాటు చేసిన బాక్స్‌లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి. 317 జీవోతో రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆర్టికల్ 317 డీ ఉల్లంఘన జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే 371 జీవో రద్దు చేసి.. స్థానికత ప్రాతిపదికన బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జీవన్ రెడ్డి గవర్నర్ కు ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. రాజ్ భవన్ ముందు ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్ సామాన్యులకు చాలా ఉపయోగపడుతోందని అభిప్రాయ పడ్డారు జీవన్ రెడ్డి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ధర్మ దర్శనంతో ఎంతోమంది సమస్యలు పరిష్కరించే వారని గుర్తు చేసుకున్నారు. గవర్నర్ అయినా కంప్లైంట్ బాక్స్ ద్వారా ప్రజల సమస్యలు వినేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు జీవన్ రెడ్డి.
తెలంగాణ ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్న జీవో నెంబర్ 317 ను తక్షణమే రద్దు చేస్తూ ఉద్యోగుల హక్కులని కాపాడాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ కు లేఖ ఇచ్చిన మాజీ మంత్రివర్యులు పట్టభద్రుల MLC జీవన్ రెడ్డి గారు. pic.twitter.com/6yXSluxfYw
— T Jeevan Reddy MLC (@jeevanreddyMLC) January 3, 2022
తెలంగాణ గవర్నర్ తమిళసై తాజాగా రాజ్ భవన్ వద్ద ఫిర్యాదులు తీసుకునేందుకు కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. ప్రజలు రాతపూర్వకంగా తమ సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని, ఫిర్యాదులు చేయొచ్చని చెప్పారు. ‘‘పబ్లిక్ సమస్యలు పరిష్కారమయ్యేలా ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. ఆర్థిక సాయం వంటి సమస్యలపై నా వంతు సాయం అందజేస్తాను” అని గవర్నర్ తెలిపారు.
సీఎం కేసీర్ కు మాజీ మంత్రి శ్రీధర్ బాబు లేఖ..
మరో వైపు జీవో 317 రద్దు చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు లేఖ రాశారు. 317 జీవో వల్ల ఉద్యోగులు నష్ట పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులు నష్ట పోకుండా బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి: Curry Leaf: అమ్మో..! కరివేపాకు కిలో రూ. 175.. గ్రేటర్‌లో చుక్కలు చూపిస్తున్న ధర..
Viral Video: కుందేలపై మరోసారి గెలిచిన తాబేలు.. ఇది కథకాదు నిజం.. వీడియో చూస్తే మీరూ అదే అంటారు..