రేపు టీఆర్‌ఎస్‌లోకి సబిత ఇంద్రారెడ్డి?
కాంగ్రెస్ సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. పార్టీని వీడకుండా చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఆమెతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సబితాఇంద్రారెడ్డి రేపు టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయినట్టు సమాచారం. మహేశ్వరం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన సబిత తన కుమారుడు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ సీటు కేటాయించాలని కాంగ్రెస్‌ను కోరారు. కాంగ్రెస్ అధిష్టానం అందుకు విముఖత వ్యక్తం […]
కాంగ్రెస్ సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. పార్టీని వీడకుండా చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఆమెతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సబితాఇంద్రారెడ్డి రేపు టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయినట్టు సమాచారం. మహేశ్వరం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన సబిత తన కుమారుడు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ సీటు కేటాయించాలని కాంగ్రెస్‌ను కోరారు. కాంగ్రెస్ అధిష్టానం అందుకు విముఖత వ్యక్తం చేయడంతో టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. చేవెళ్ల నుంచి గతంలో టీఆర్ఎస్ తరపున ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. దీంతో కార్తీక్ రెడ్డికి టీఆర్‌ఎస్‌లో ఎంపీ సీటు ఆఫర్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.