పవన్ పై చిన్నికృష్ణ ఫైర్..!

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేలా ఎన్నికల ప్రచార సభల్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తున్నారని ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ మండిపడ్డారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తామంతా తెలంగాణలో సంతోషంగా బతుకుతున్నాం అని అన్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ అర్ధం లేకుండా మాట్లాడుతున్నారని.. అసలు ఆయన సిద్ధాంతాలేమిటో చెప్పాలన్నారు చిన్నికృష్ణ. కేసీఆర్, జగన్‌లను తిట్టే అర్హత పవన్‌కి లేదని.. వాళ్ల దగ్గర పవన్ రాజకీయ ఓనమాలు నేర్చుకోవాలని సూచించారు. జగన్‌ను ఒంటరి చేసి […]

పవన్ పై చిన్నికృష్ణ ఫైర్..!

Updated on: Mar 25, 2019 | 2:13 PM

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేలా ఎన్నికల ప్రచార సభల్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తున్నారని ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ మండిపడ్డారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తామంతా తెలంగాణలో సంతోషంగా బతుకుతున్నాం అని అన్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ అర్ధం లేకుండా మాట్లాడుతున్నారని.. అసలు ఆయన సిద్ధాంతాలేమిటో చెప్పాలన్నారు చిన్నికృష్ణ. కేసీఆర్, జగన్‌లను తిట్టే అర్హత పవన్‌కి లేదని.. వాళ్ల దగ్గర పవన్ రాజకీయ ఓనమాలు నేర్చుకోవాలని సూచించారు. జగన్‌ను ఒంటరి చేసి ఆడుకుందాం అనుకుంటే కుదరదని.. జగన్ వెంట తామున్నామని చెప్పారు. కచ్చితంగా వచ్చేది జగన్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు అని పవన్ పై చిన్నికృష్ణ ఫైర్ అయ్యారు.

ఇక.. కాపు సామాజికవర్గ నేతలకు టిక్కెట్లు ఇచ్చి పవన్ డబ్బులు వసూలు చేస్తున్నారని చిన్నికృష్ణ ఆరోపించారు. అంతేకాదు కొంచెం పర్సనల్ గా కూడా దిగి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘చిరుకి ఇండస్ట్రీ హిట్ కథను ఇచ్చానని.. అప్పుడు కనీసం 10 రూపాయలు పప్పన్నం కూడా పెట్టలేదని.. ఇక అలాంటి వారికి ఎందుకు సపోర్ట్ ఇవ్వాలని ఆయన ఎద్దేవా చేశారు. అసలు మీ కుటుంబం ఏ పార్టీతో చేతులు కలిపారో ముందు చెప్పండి.. అని చిన్నికృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నేను నోరు తెరిస్తే పవన్ నవరంధ్రాలు మూసుకోవాల్సిందే.. మీరు.. మీ చేతులు కలిపినా పార్టీ సభ్యులందరికి కూడా పేరు పేరున చెబుతున్నాను.. నా నోరు తెరిపించే పని చేయొద్దు. అంటూ చిన్ని కృష్ణ వ్యాఖ్యానించడంతో ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. ఇక దీనిపై మెగా ఫ్యామిలీ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.