Telangana: వచ్చే నెలలో సీఎం రేవంత్‌ రెడ్డి జిల్లాల పర్యటన.. ముఖ్య ఉద్దేశం ఇదే !

|

Dec 11, 2023 | 11:33 AM

సింగరేణి ప్రాంతం పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గాలను కవర్ చేస్తుంది. 2017 అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో BRS అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) గెలుపొందగా, కోల్ బెల్ట్ ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు యూనియన్ ఎన్నికలను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో 39,748 మంది కార్మికులు (ఓటర్లు) తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Telangana: వచ్చే నెలలో సీఎం రేవంత్‌ రెడ్డి జిల్లాల పర్యటన.. ముఖ్య ఉద్దేశం ఇదే !
Telangana Chief Minister
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో జిల్లా పర్యటనలు ప్రారంభించబోతున్నారా..? ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అవుననే తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లోగా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడం అలాగే 2024 ఏప్రిల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని పార్టీని మరింత పటిష్టం చేయడం ఈ పర్యటనల ప్రధాన ఉద్ధేశంగా తెలుస్తోంది. శాసనసభలో స్పీకర్ ఎన్నిక ఈ నెల 14న జరిగిన తర్వాత ఓ వారం పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాల తర్వాతే జిల్లా పర్యటనలు ఉండే అవకాశం ఉంది. అంతే కాదు ఆ పర్యటనలకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు కూడా భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమచారం. మొత్తంగా వీటన్నింటినీ ఈ నెలాఖరులోగా పూర్తి చేసి కొత్త ఏడాదిలో అంటే 2024 జనవరిలో సీఎం జిల్లాకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

డిసెంబర్ 27న జరగనున్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఉద్యోగుల సంఘం ఎన్నికలపై కూడా రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. సింగరేణి ప్రాంతం పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గాలను కవర్ చేస్తుంది. 2017 అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో BRS అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) గెలుపొందగా, కోల్ బెల్ట్ ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు యూనియన్ ఎన్నికలను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో 39,748 మంది కార్మికులు (ఓటర్లు) తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

అలాగే సింగరేణి పరిధిలో ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని 11 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తాజా ఎన్నికల్లో తొమ్మిదింటిని కాంగ్రెస్ గెలుచుకుంది. కొత్తగూడెం కాంగ్రెస్‌ మిత్రపక్షమైన సీపీఐకి వెళ్లగా, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోవ లక్ష్మి ఆసిఫాబాద్‌ స్థానంలో గెలుపొందారు. 2018లో కాంగ్రెస్ ఆరు గెలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..