Jana Reddy: పార్టీ ఆదేశిస్తే పోటీకి రెడీ.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆదేశిస్తే నల్లొంగ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తానంటూ వ్యాఖ్యానించారు. నల్గొండ పార్లమెంట్‌కి పోటీ చేస్తానని గతంలో చెప్పానని.. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే కచ్చితంగా పోటీ చేస్తానంటూ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 15 ఏళ్లు మంత్రిగా ఉన్నానని.. తన కుమారుడు ఎమ్మెల్యే జైవీర్‌కు పదవి ఇవ్వాలని అడగలేదంటూ పేర్కొన్నారు.

Jana Reddy: పార్టీ ఆదేశిస్తే పోటీకి రెడీ.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
Jana Reddy Revanth Reddy
Follow us

|

Updated on: Dec 11, 2023 | 2:43 PM

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆదేశిస్తే నల్లొంగ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తానంటూ వ్యాఖ్యానించారు. నల్గొండ పార్లమెంట్‌కి పోటీ చేస్తానని గతంలో చెప్పానని.. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే కచ్చితంగా పోటీ చేస్తానంటూ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 15 ఏళ్లు మంత్రిగా ఉన్నానని.. తన కుమారుడు ఎమ్మెల్యే జైవీర్‌కు పదవి ఇవ్వాలని అడగలేదంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం జైవీర్ ఎమ్మెల్యేగా ఉన్నారని.. ఆయన ఇంకా జూనియర్‌.. ఇప్పుడే పదవులు అడగలేం. ఇవ్వడం కూడా సమంజసం కాదు.. అంటూ తన మనసులోని మాటను జానారెడ్డి బయటపెట్టారు.

సోమవారం.. కె.జానారెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంను జానారెడ్డి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు గంటసేపు ఇద్దరి మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. అనంతరం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కూడా జానారెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ను కలిసి మాట్లాడారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జానారెడ్డి.. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి అందరూ సహకరించాలని కోరారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజాభిమానం సొంతం చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించినట్లు జానారెడ్డి తెలిపారు.

వీడియో చూడండి..

సీఎం, మంత్రులు ఐకమత్యంతో పనిచేయాలి.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందించాలని వారికి సూచించినట్లు జానారెడ్డి తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్‌కు గాయం కావడం బాధాకరమని.. ఆయన్ను పరామర్శించానని.. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలంటూ జానారెడ్డి ఆకాంక్షించారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా సూచనలు ఇవ్వాలని.. కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త