జగన్ గురించి ఆ విషయం చెబుతూ నవ్వాపుకోలేకపోయిన చంద్రబాబు

సర్వేపల్లి: నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోడి కత్తి పార్టీ పైన ఎవరికీ నమ్మకం లేదని, ఆ పార్టీతో ఎవరికీ ఉద్యోగాలు రావని అన్నారు. పారిశ్రామికవేత్తలు వైసీపీని చూస్తే పారిపోతారని, తనను చూస్తే వస్తారని చెప్పారు. వైసీపీని నమ్ముకుంటే మీ పరిస్థితి జైలే అని, జైలు పక్షులతో సావాసం చేస్తామా అంటూ చంద్రబాబు విమర్శలు […]

జగన్ గురించి ఆ విషయం చెబుతూ నవ్వాపుకోలేకపోయిన చంద్రబాబు
Follow us

|

Updated on: Apr 03, 2019 | 8:34 AM

సర్వేపల్లి: నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోడి కత్తి పార్టీ పైన ఎవరికీ నమ్మకం లేదని, ఆ పార్టీతో ఎవరికీ ఉద్యోగాలు రావని అన్నారు. పారిశ్రామికవేత్తలు వైసీపీని చూస్తే పారిపోతారని, తనను చూస్తే వస్తారని చెప్పారు. వైసీపీని నమ్ముకుంటే మీ పరిస్థితి జైలే అని, జైలు పక్షులతో సావాసం చేస్తామా అంటూ చంద్రబాబు విమర్శలు చేశారు.

ఎలక్షన్ కమీషన్‌కు జగన్ దాఖలు చేసిన అఫడవిట్‌ చూస్తే 31 కేసులున్నట్టు అందులో ఉందని చంద్రబాబు చెప్పారు. నా మీద 31 కేసులన్నాయి మీరు ఆలోచించుకోండి అని రాసిన ఒక బోర్డును జగన్ మెడలో ఎలక్షన్ కమీషన్ కడితో బాగుంటుందని చంద్రబాబు నవ్వుతూ అన్నారు.

లేకపోతే ఆయన వాహనం చుట్టూ ఆ బోర్డులు కట్టిస్తే… అంటూ చంద్రబాబు మళ్లీ నవ్వారు. చట్టంలో ఎన్ని కేసులున్నాయో అన్ని కేసులు జగన్ మీద ఉన్నాయని చంద్రబాబు విమర్శించారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా చంద్రబాబుతో పాటు రోడ్‌షోలో పాల్గొన్నారు.