ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం ఒంగోలు పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన టీడీపీ ఎన్నికల సన్నాహక బహిరంగ సభలో ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. గత ఐదేళ్ళుగా తాను చేసిన అభివృద్ధి పనులే మళ్లీ టీడీపీని గెలిపిస్తాయన్నారు. ఐదేళ్లు ప్రజలను ఆనందంగా ఉంచామని, ప్రజలు మళ్లీ టీడీపీని గెలిపించి.. తిరుగులేని శక్తివంతమైన పార్టీగా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు స్పష్టం చేశారు.