
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీడీపీ మేనిఫెస్టో మరికాసేపట్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ మేనిఫెస్టో విడుదల రెండుసార్లు వాయిదా పడింది. గురువారమే రిలీజ్ చేయాలని భావించినా.. సంక్షేమాలపై మరింత ఫోకస్ పెట్టాలని చంద్రబాబు ఆదేశించడంతో ఆ దిశగా మేనిఫెస్టో కమిటీ కసరత్తు చేసింది. 10 గంటలకు చంద్రబాబు టీడీపీ మేనిఫెస్టోను ప్రకటిస్తారని సమాచారం.
మంత్రి యనమల నేతృత్వంలోని కమిటీ.. టీడీపీ మేనిఫెస్టోను రూపొందించింది. ఓటర్లను ఆకట్టుకునేలా సంక్షేమ పథకాలతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలపైనా అధికంగా ఫోకస్ చేసినట్లు సమాచారం. మళ్లీ అధికారంలోకి వస్తే వృద్ధాప్య పించన్ల వయో పరిమితిని 60 ఏళ్లకు తగ్గిస్తామని.. మహిళలకు 55 ఏళ్లకే పించన్ అందజేసే హామీలతో మేనిఫెస్టో రూపొందించినట్లు తెలుస్తోంది. పసుము-కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలను కూడా భవిష్యత్తులో కొనసాగించాలని మేనిఫెస్టోలో పొందిపరిచినట్లు సమాచారం.