ఏపీలో పొడిచిన పొత్తులు.. జనసేన, బీఎస్పీ కలిసి పోటీ
ఉత్తరప్రదేశ్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎన్నికల పొత్తు కట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల్లో రెండు పార్టీలు కలసి పోటీ చేయాలని నిర్ణయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికలపై చర్చించారు. రెండు పార్టీలు కలసి ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై సమాలోచన చేశారు. సీట్ల పంపకాలు కూడా దాదాపు పూర్తయ్యాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి […]

ఉత్తరప్రదేశ్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎన్నికల పొత్తు కట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల్లో రెండు పార్టీలు కలసి పోటీ చేయాలని నిర్ణయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికలపై చర్చించారు. రెండు పార్టీలు కలసి ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై సమాలోచన చేశారు. సీట్ల పంపకాలు కూడా దాదాపు పూర్తయ్యాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో జనసేన, బీఎస్పీ కలసి పోటీ చేస్తాయని ఆమె ప్రకటించారు. ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్‌ను చూడాలని అనుకుంటున్నా.. త్వరలో ఏపీలో ప్రచారాన్ని ప్రారంభిస్తా.. సీట్ల పంపకం కూడా దాదాపు పూర్తయింది అని మాయావతి అన్నారు. బీఎస్పీతో పొత్తుపెట్టుకోవడం ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. మాయావతి మార్గనిర్దేశకత్వం చాలా అవసరమని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని.. సామాజిక న్యాయం అందరికీ అందాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ దేశానికి ప్రధానిగా మాయావతిని చూడాలనుకుంటున్నామని.. అది తమ పార్టీ బలమైన అభిలాష అన్నారు.



