తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీష్‌రెడ్డి సస్పెన్షన్… ఈ సెషన్ వరకు సస్పెండ్ చేసిన స్పీకర్
స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చర్యలు తీసుకున్నారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు స్పీకర్‌ను కించపరిచేలా ఉన్నాయంటూ అధికార పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ పరిణామాలతో స్పీకర్ సభను వాయిదా వేశారు. సభ వాయిదా అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను ఆయన ఛాంబర్‌లో కలిశారు. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలన్నారు మాజీమంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు. స్పీకర్‌ను జగదీష్‌రెడ్డి అవమానించలేదన్నారు. సభ మీ ఒక్కరిది కాదు..అందరిది అని మాత్రమే జగదీష్ రెడ్డి అన్నారని

స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చర్యలు తీసుకున్నారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు స్పీకర్‌ను కించపరిచేలా ఉన్నాయంటూ అధికార పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ పరిణామాలతో స్పీకర్ సభను వాయిదా వేశారు. సభ వాయిదా అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను ఆయన ఛాంబర్‌లో కలిశారు. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలన్నారు మాజీమంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు. స్పీకర్‌ను జగదీష్‌రెడ్డి అవమానించలేదన్నారు. సభ మీ ఒక్కరిది కాదు..అందరిది అని మాత్రమే జగదీష్ రెడ్డి అన్నారని.. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదని కామెంట్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చేశారో తెలీదని.. సభను ఎందుకు వాయిదా వేశారో అర్థంకావడం లేదన్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణ స్పీకర్‌తో పలువురు మంత్రులు సమావేశమయ్యారు. సభలో జరిగిన అంశంపై ఆయనతో చర్చించారు. జగదీష్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ డిమాండ్ చేస్తు్న్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు సభలో జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సభ మీ సొంతం కాదని స్పీకర్‌ను ఉద్దేశించి అన్నారు జగదీష్‌రెడ్డి. ఆయన వ్యాఖ్యలపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ పరిణామంతో సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్పీకర్ అధికారాలు, సభ్యుల హక్కులు ఏంటో తేలాలని.. సభా సంప్రదాయాలు ఏంటో తేలాకే మాట్లాడతానని జగదీష్ రెడ్డి అన్నారు. దళిత స్పీకర్‌ను జగదీష్ అవమానించారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. జగదీష్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. ఆయనను సస్పెండ్ చేయాలన్నారు.
మరోవైపు ఈ అంశంపై ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్‌తో మంత్రి శ్రీధర్‌బాబు చర్చలు జరిపారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్పీకర్‌పై జగదీష్‌రెడ్డి వ్యాఖ్యలకు తదుపరి కార్యాచరణపై సీఎంతో చర్చించారు. అటు స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.