బీజేపీ ఎంపీ అభ్యర్థి సంజయ్‌కు అస్వస్థత

కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ కుమార్‌ అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారానికి ఈ రోజుతో గడువు పూర్తికానున్న నేపథ్యంలో ఆయన ప్రచారాన్ని తీవ్రం చేశారు.  విజయ సంకల్ప యాత్ర పేరుతో కరీంగనర్‌ పట్టణంలో భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సర్కిల్‌కు చేరుకోగానే ఒక్కసారిగా ప్రచార వాహనంలోనే సంజయ్‌ కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన కార్యకర్తలు, నేతలు ఆయనను అంబులెన్స్‌లో సమీపంలోని అపోలో రీచ్‌ ఆస్పత్రికి తరలించారు. ఎండల తీవ్రతతో సంజయ్‌ […]

బీజేపీ ఎంపీ అభ్యర్థి సంజయ్‌కు అస్వస్థత

Edited By:

Updated on: Apr 09, 2019 | 7:45 PM

కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ కుమార్‌ అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారానికి ఈ రోజుతో గడువు పూర్తికానున్న నేపథ్యంలో ఆయన ప్రచారాన్ని తీవ్రం చేశారు.  విజయ సంకల్ప యాత్ర పేరుతో కరీంగనర్‌ పట్టణంలో భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సర్కిల్‌కు చేరుకోగానే ఒక్కసారిగా ప్రచార వాహనంలోనే సంజయ్‌ కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన కార్యకర్తలు, నేతలు ఆయనను అంబులెన్స్‌లో సమీపంలోని అపోలో రీచ్‌ ఆస్పత్రికి తరలించారు. ఎండల తీవ్రతతో సంజయ్‌ అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయినట్టు డాక్టర్లు తెలిపారు.