1 వీక్ డెడ్‌లైన్..కేసీఆర్ చిత్రాలు తొలగించాల్సిందే!

1 వీక్ డెడ్‌లైన్..కేసీఆర్ చిత్రాలు తొలగించాల్సిందే!
BJP MLA warns against carvings of KCR's face on temple pillars

బీజేపీ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ శనివారంనాడు యాదాద్రిలో పర్యటించారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ప్రాకారాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాలను చెక్కడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజాసింగ్ యాదాద్రిని సందర్శించారు. ముందుగా స్వామివారిని దర్శించి..తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాకారాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం, మరో స్తంభానికి కేసీఆర్ చిత్రాలు, దక్షిణ రాజగోపురం వైపున్న అష్టభుజి ప్రాకార మండపంలో కారు గుర్తు, కేసీఆర్ కిట్, తెలంగాణ లోగోలో […]

Ram Naramaneni

|

Sep 07, 2019 | 4:00 PM

బీజేపీ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ శనివారంనాడు యాదాద్రిలో పర్యటించారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ప్రాకారాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాలను చెక్కడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజాసింగ్ యాదాద్రిని సందర్శించారు. ముందుగా స్వామివారిని దర్శించి..తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఆలయ ప్రాకారాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం, మరో స్తంభానికి కేసీఆర్ చిత్రాలు, దక్షిణ రాజగోపురం వైపున్న అష్టభుజి ప్రాకార మండపంలో కారు గుర్తు, కేసీఆర్ కిట్, తెలంగాణ లోగోలో చార్మినార్‌ చిత్రాన్ని చెక్కారు. రాజాసింగ్ శనివారం స్థానిక బిజెపి నేతలతో కలిసి వాటిని  నిశితంగా పరిశీలించారు. యాదాద్రి స్తంభాలపై కేసీఆర్, కారు చిత్రాలను చెక్కడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని తొలగించడానికి ప్రభుత్వానికి వారం రోజుల గడువు ఇస్తున్నామని.. వెనక్కి తగ్గకపోతే అన్ని దేవాలయాల్లో ఆందోళనలు చేస్తామని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిని ప్రపంచ స్థాయి క్షేత్రంగా చేయడాన్ని స్వాగతిస్తున్నామని..అయితే ఆయన బొమ్మలను చెక్కడం సరికాదని  అన్నారు.  రాష్ట్ర నాయకత్వంతో చర్చించి త్వరలోనే కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. భావి తరాలకు తెలియజేయడానికి నాయకుల బొమ్మలను చెక్కినప్పుడు వారి అవినీతిని కూడా చెక్కుతారా అని ప్రశ్నించారు. కాగా ఇప్పటికే ఈ ఇష్యూపై భజరంగ దళ్, హిందూ పరిరక్షణ సమితి, విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలు నిరసనకు దిగాయి. కాంగ్రెసు నేతలు కూడా యాదాద్రి వ్యవహారంపై దుమ్మెత్తి పోస్తున్న విషయం తెలిసిందే.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu