Etela Rajender: వరి వేయొద్దనడం ఎంత వరకు కరెక్టో చెప్పాలి.. సీఎం కేసీఆర్‌కు ఈటెల రాజేందర్ సూటి ప్రశ్నలు..
రాష్ట్రంలో సమృద్ధిగా నీరు, కరెంటు ఉందన్న సీఎం కేసీఆర్(CM KCR).. ఇప్పుడు పంట కొనబోనని చెప్పడం దారుణమన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender). శుక్రవారం..
రాష్ట్రంలో సమృద్ధిగా నీరు, కరెంటు ఉందన్న సీఎం కేసీఆర్(CM KCR).. ఇప్పుడు పంట కొనబోనని చెప్పడం దారుణమన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender). శుక్రవారం హైద్రాబాద్ లోని BJP కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ విధానాల వల్ల ఇప్పుడు రాష్ట్రంలో రైతు నష్టపోతున్నాడన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో రోజు రోజుకు కరెంటు కోతలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో ఎంఎస్‌పీ కంటే ఎక్కువ ధరలు చెల్లించి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని వివరించారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు. వరి ధాన్యం వచ్చే అవకాశం ఉందని తెలిసీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఎలాంటి ఏర్పాట్లు చేసుకోలేదని ఆయన ఆరోపించారు.
తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల కోటి ఎకరాలు పంట పండల్సిన చోట పంటలు పండించలేని దుస్థితి ఏర్పడిందన్నారు. రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులకు క్షమాపణ చెప్పి సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి రైస్ మిల్స్ ను ఏర్పాటు చేయలేదన్నారు. గతంలో ఉన్న రైసు మిల్లులే ఉన్నాయన్నారు. ఈ మిల్లులు పాత టెక్నాలజీ నడుస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
వరి ధాన్యం వస్తుందని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ప్లాన్ చేసుకోలేదని ఆయన విమర్శించారు. కొన్ని రాష్ట్రాల్లోని రైసు మిల్లుల్లో గంటకు 150 టన్నుల వరి ధాన్యం బియ్యంగా మార్చుతున్నారన్నారు. అంతేకాదు పంట చేల నుంచి నేరుగా ధాన్యాన్ని తమ మిల్లుల వద్దకు తీసుకెళ్లున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయని రాజేందర్ గుర్తు చేశారు.
పెంచిన విద్యుత్, బస్ చార్జీలు నుంచి ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం సీఎం కేసీఆర్ చేస్తున్నారు. లక్షలాది మంది రైతులు, పౌల్ట్రీ రంగం ఉసురు కేసీఆర్ పోసుకుంటున్నారన్నారు మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి: Rahul Gandhi: ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి.. రాహుల్ పర్యటనలో ఆంతర్యం అదే..