కమలం గుర్తుకు ఓటేస్తే.. మహాలక్ష్మీ మీ ఇంటికొస్తుందంటున్న బీజేపీ నేత : వీడియో

మీరట్ : ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కొందరు బహిరంగ సభల్లో చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ ప్రజల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సభలో చోటుచేసుకుంది. బీజేపీ నేత వినీత్ అగర్వాల్ ఓ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ.. మీకు కమలం కావాలో.. ఏం కావాలో ఆలోచించండి. కమలం.. కమలం.. కమలం.. అని పదే పదే అంటూ.. ఉద్వేగబరితంగా ప్రసంగించారు. దీంతో మీటింగ్ వచ్చిన ప్రజలంతా వినీత్ […]

కమలం గుర్తుకు ఓటేస్తే.. మహాలక్ష్మీ  మీ ఇంటికొస్తుందంటున్న బీజేపీ నేత : వీడియో

Edited By:

Updated on: Apr 02, 2019 | 8:56 PM

మీరట్ : ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కొందరు బహిరంగ సభల్లో చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ ప్రజల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సభలో చోటుచేసుకుంది. బీజేపీ నేత వినీత్ అగర్వాల్ ఓ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ.. మీకు కమలం కావాలో.. ఏం కావాలో ఆలోచించండి. కమలం.. కమలం.. కమలం.. అని పదే పదే అంటూ.. ఉద్వేగబరితంగా ప్రసంగించారు. దీంతో మీటింగ్ వచ్చిన ప్రజలంతా వినీత్ అగర్వాల్ ప్రసంగం విని కడుపుబ్బా నవ్వుకున్నారు. అంతే కాదు మీరు కమలం గుర్తుకు ఓటేస్తే మహాలక్ష్మీ మీ ఇంటికి వస్తుందంటూ చెప్పుకొచ్చారు. వినీత్ అగర్వాల్ ఆవేశంతో.. ఉద్వేగపూరితంగా కమలం గుర్తుకు ఓటేయండంటూ చేసిన ప్రసంగంతో అక్కడున్న నేతలు కూడా నవ్వుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మీరు కూడా ఆ వీడియోను చూసి తరించండి.