ఆ విషయంలో కేంద్ర నిర్ణయం సబబే.. జగన్‌, చంద్రబాబుకు అన్నీ తెలుసు.. రాజకీయ లబ్దికోసమే రాద్దాతమంటున్న బీజేపీ

|

Mar 13, 2021 | 10:58 AM

కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఉక్కునగరం విశాఖ రగిలిపోతుంది. స్టీల్‌ ఫ్యాక్టరీని ప్రైవేటుకు అమ్మేస్తున్నామంటూ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటనతో కార్మికుల నిరసనలు..

ఆ విషయంలో కేంద్ర నిర్ణయం సబబే.. జగన్‌, చంద్రబాబుకు అన్నీ తెలుసు.. రాజకీయ లబ్దికోసమే రాద్దాతమంటున్న బీజేపీ
Gnt Bjp Pc
Follow us on

కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఉక్కునగరం విశాఖ రగిలిపోతుంది. స్టీల్‌ ఫ్యాక్టరీని ప్రైవేటుకు అమ్మేస్తున్నామంటూ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటనతో కార్మికుల నిరసనలు హోరెత్తుతున్నాయి. దీంతో విశాఖ అట్టుడుకుతుంది. ఇంతకాలం శాంతియుతంగా ఉద్యమించిన కార్మికులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలు తగులబెడుతున్నారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అయితే విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ అమ్మకంలో అవసరమైనప్పుడల్లా ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలుపడంతో రాష్ట్రంలోని వైసీపీ సర్కార్‌ కార్మికుల ముందు దోషిగా నిల్చుంది. ఈ నేపథ్యంలో కార్మికులు భవిష్యత్‌ ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. కార్మిక సంఘాల నిరసనలతో స్టీల్ సిటీ భగ్గుమంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గూడుపుఠాని బయటపడడంతో కార్మికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. జగన్, మోదీ ప్రభుత్వాలకు తమ ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెడుతున్నారు.

ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని తేలిపోయింది. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అన్నది రాజకీయ పార్టీల చేతుల్లో ఉంది. ఇప్పటికే పార్టీలకు అతీతంగా విశాఖ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. బీజీపీ, జనసేన మినహా అన్ని రాజకీయ పార్టీలు ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే అధికార వైసీపీ మాత్రం కేంద్రాన్ని ఒప్పించగలం అనే ధీమాతో కనిపించింది. ఇటు జనసేన సైతం కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటుందని ఆశపడింది. ఇప్పుడు కేంద్రం నిర్ణయంతో ఆ రెండు పార్టీలు డైలమాలో పడ్డాయి.

అయితే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం సబబే అంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలోకి తప్పుడు సంకేతాలను తీసుకువెళ్తుతున్నాయని టొబాకో బోర్డు చైర్మన్ రఘునాధ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు. రాజకీయ లబ్ధికోసమే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రవేటీకరణ గురుంచి రక రకాల అపోహలు సృష్టిస్తున్నారన్నారు.

ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేస్తే సమర్దవంతంగా నడుస్తుందని.. హై క్వాలిటీ స్టీల్ పెట్టేందుకు విశాఖలో అణువైన స్థలం ఉందని అని చెప్పారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ స్థలాన్ని అమ్ముకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలని గుర్తుచేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు చంద్రబాబు, జగన్ ఇద్దరు అనుకూలమే అని అన్నారు. ప్రైవేటు సంస్థలు విజయవంతంగా నడుస్తున్నప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అయితే మరింత విజయవంతంగా నడుస్తుందని చెప్పుకొచ్చారు. బిజెపిని విమర్శించడం మానుకొని రాష్ట్ర అభివృద్ది సహకరించాలని రఘునాధబాబు కోరారు.

 

Read More:

పేరూరుకు నీరొచ్చింది.. రైతుకు నవ్వొచ్చింది.. పరిటాల కుటుంబానికి మాత్రం కన్నీరొచ్చింది -గోరంట్ల మాధవ్

ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ఆలా అయితే చెల్లదన్న ధర్మాసనం

ఎన్నికల ఇంచార్జ్‌లతో మంత్రి హరీశ్‌రావు టెలికాన్ఫరెన్స్‌.. ఆ విషయంలో మంత్రి కీలక సూచనలు