లోక్‌సభలో అసదుద్దీన్ ఒవైసీ కీలక కామెంట్స్.. బీజేపీ హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే అవకాశం..
Asaduddin Owaisi Comments: లోక్‌సభ సమావేశాల్లో ఎంఐఎం పార్టీకి చెందిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక కామెంట్స్ చేశారు. బీజేపీ పార్టీ హైదరాబాద్‌ను
Asaduddin Owaisi Comments: లోక్‌సభ సమావేశాల్లో ఎంఐఎం పార్టీకి చెందిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక కామెంట్స్ చేశారు. బీజేపీ పార్టీ హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. జమ్మూ కశ్మీర్ విభజన చట్టంపై చరిగిన చర్చలో భాగంగా అసదుద్దీన్ ఈ కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగుళూరు, ముంబై, అహ్మదాబాద్, లక్నోలను బీజేపీ ప్రభుత్వం కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చాలని చూస్తోందన్నారు. ఇందుకు కశ్మీర్ విభజనే పెద్ద ఉదాహరణగా చూపారు. ఇప్పడు ప్రభుత్వానికి మద్దతిచ్చే పార్టీలు భవిష్యత్ పరిణామాలకు రెడీగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పుడు చప్పట్లు కొట్టే పార్టీలు అప్పుడు గొడవలు చేయడం ఖాయమన్నారు. మోదీ ప్రభుత్వం భవిష్యత్‌లో ఇదే నిర్ణయం తీసుకుంటుందని అందరిని హెచ్చరిస్తూ మాట్లాడారు.
INDIA VS ENGLAND 2021: తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటైన భారత్.. నాటౌట్‌గా నిలిచిన రిషబ్ పంత్