Vizianagaram MLC Election: విజయనగరం MLC ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. హైకోర్టు షాకింగ్‌ తీర్పు! ఇరకాటంలో ఎన్నికలు..?

| Edited By: Srilakshmi C

Nov 08, 2024 | 11:02 AM

విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇరకాటంలో పడ్డాయి. తాజా హైకోర్టు తీర్పుతో అసలు ఎన్నికలు జరుగుతాయో.. లేదోనన్న జంజాటంలో అటు వైసీపీ, ఇటు టీడీపీ తర్జనభర్జనలు పడుతున్నాయి. అసలేం జరిగిందంటే..

Vizianagaram MLC Election: విజయనగరం MLC ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. హైకోర్టు షాకింగ్‌ తీర్పు! ఇరకాటంలో ఎన్నికలు..?
Vizianagaram MLC Election
Follow us on

విజయనగరం, నవంబర్ 8: విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌తో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇరు పార్టీలు ఎన్నికకు సిద్ధమవుతున్న వేళ బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. 2021లో జరిగిన స్థానిక సంస్థల కోటాలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇందుకూరి రాజు. ఆ తరువాత కొన్నాళ్ళు బాగానే ఉన్నా ఆ తరువాత తన సొంత నియోజకవర్గమైన ఎస్ కోటలో అప్పటి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుకు మధ్య మనస్పర్ధలు నెలకొన్నాయి. అలా రఘురాజు భార్య ఇందుకూరి సుధారాణి వైసీపీని వీడి టీడీపీలో జాయిన్ అయ్యారు. దీంతో ఎమ్మెల్సీ ఇందుకూరి రవిరాజు వైసీపీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పార్టీ మండలి విప్ పాలవలస విక్రాంత్ మండలి చైర్మన్ మోషన్ రాజుకు ఫిర్యాదు చేశారు. వైసీపీ ఫిర్యాదుతో ఇందుకూరి రఘురాజు పై అనర్హత వేటు వేశారు మండలి చైర్మన్.

అయితే తాను ఏ తప్పు చేయలేదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదని తనపై వేసిన అనర్హత వేటుపై హైకోర్టును ఆశ్రయించారు రఘురాజు. అలా హైకోర్టులో రఘురాజు పిటిషన్ కొనసాగుతుండగానే అనర్హత వేటుతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇరు రాజకీయ పార్టీలు తమ పార్టీల నుండి ఎవరిని అభ్యర్థిగా ఖరారు చేయాలనే అంశం పై ముమ్మర చేస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ అభ్యర్థిగా బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పల నాయుడును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు పార్టీ అధినేత వైఎస్ జగన్. అధికార కూటమి కూడా మరో ఒకటి, రెండు రోజుల్లో తమ అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధం అవుతుంది. అలా ఎన్నికలకు ఎవరికి వారు బిజీ బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో రఘు అనర్హత పిటిషన్ పై హైకోర్టులో కూడా తుది విచారణ జరిగింది. ఈ విచారణలో తుది వాదనలు విన్న హైకోర్టు మండల చైర్మన్ మోషన్ రాజు వేసిన అనర్హత వేటు చెల్లదని, తిరిగి ఎమ్మెల్సీగా రఘురాజు కొనసాగేలా ఆర్డర్ ఇచ్చింది. దీంతో ఒకసారిగా ఎమ్మెల్సీ ఎన్నిక కొత్త చర్చకు దారి తీసింది.

అయితే ఎమ్మెల్సీ అనర్హత వేటు రద్దు చేసిన హైకోర్టు తీర్పుతో శాసనమండలి ఎన్నిక నోటిఫికేషన్ ఇప్పడు సర్వత్రా ఉత్కంఠగా మారింది. హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్సీ ఎన్నిక రద్ధవుతుందా? లేక యధావిధిగా కొనసాగుతుందా అనే అంశం పై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. హైకోర్టు తీర్పు పై మండలి చైర్మన్ అప్పీల్ కోసం కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణ సాగుతుంది. అదే జరిగితే ఎమ్మెల్సీ ఎన్నిక కొనసాగే అవకాశం ఉంది. అలా కాకుండా హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని రఘురాజు కోర్టును ఆశ్రయించే అవకాశం కూడా కనిపిస్తుంది. అదే జరిగి హైకోర్టు రఘురాజు కు అనుకూలంగా తీర్పు ఇస్తే నోటిఫికేషన్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఇందుకూరి రఘురాజుకు అనుకూలంగా వచ్చిన తీర్పు పై ఇరు పార్టీల న్యాయనిపుణులు ఈ అంశం పై ఎన్నికల ప్రక్రియ సాధ్యాసాధ్యాల పై అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా ప్రస్తుత హైకోర్టు తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.