YS Jagan: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. ఏపీ సర్కార్‌పై వైసీపీ చీఫ్ జగన్ ఫైర్

నిబంధనలు పాటించకుండా అరెస్ట్‌లు చేస్తున్నారు.. కేసుల మీద కేసులు పెట్టి అరెస్ట్‌లు చేస్తున్నారంటూ వైఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కుటుంబసభ్యులను కూడా స్టేషన్లకు తీసుకెళ్తున్నారని.. డీజీపీ మీద కావాలనే ఒత్తిడి తెస్తున్నారంటూ పేర్కొన్నారు.

YS Jagan: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. ఏపీ సర్కార్‌పై వైసీపీ చీఫ్ జగన్ ఫైర్
Ys Jagan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 07, 2024 | 7:42 PM

నిబంధనలు పాటించకుండా అరెస్ట్‌లు చేస్తున్నారు.. కేసుల మీద కేసులు పెట్టి దారుణంగా వ్యవహరిస్తున్నారని వైఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కుటుంబసభ్యులను కూడా స్టేషన్లకు తీసుకెళ్తున్నారని.. డీజీపీ మీద కావాలనే ఒత్తిడి తెస్తున్నారంటూ పేర్కొన్నారు. వ్యతిరేకంగా ఉన్న స్వరాలను తట్టుకోలేక కేసులు పెడుతున్నారని.. ఏపీలో అరాచక పరిస్థితి కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారని.. ఆరోపించారు.రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయని.. ప్రశ్నించే వాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు.

హామీలు అమలు చేయకుండా అందరినీ మోసం చేస్తున్నారని.. అన్ని వ్యవస్థలను నీరుగార్చి.. నాశనం చేస్తున్నారంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యావ్యవస్థలో సంస్కరణలను నిర్వీర్యం చేశారని.. వైద్యరంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు.. టీడీపీ కార్యకర్తలు చెప్పిన వాళ్లకే పథకాలు అందిస్తున్నారని.. ఇప్పటికే లక్షన్నర పెన్షన్లు తొలగించారంటూ  జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని.. 5 నెలల్లో 91మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయంటూ జగన్ పేర్కొన్నారు.

జమిలి ఎన్నికలు అంటున్నారని.. త్వరలోనే ఈ ప్రభుత్వం పడిపోవచ్చు.. తర్వాత వచ్చేది తామేనని వైఎస్ జగన్ ధీమా వ్యక్తంచేశారు. రెడ్ బుక్ పెట్టుకునేది వాళ్లే కాదు.. ఇవాళ నష్టపోయిన ప్రతి కుటుంబం రెడ్ బుక్ పెట్టుకుంటుందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇలానే వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమంటూ చెప్పారు.

సరస్వతి భూములపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని..ఆ భూముల్లో ఎలాంటి అక్రమాలు లేవని వైఎస్ జగన్ పేర్కొన్నారు. విచారణకు వెళ్లిన ఎమ్మార్వోనే పరిశీలించి నిజాలు చెప్పారని పేర్కొన్నారు.

లైవ్ వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..