CID notices : అమరావతిలో అసైన్డ్‌భూముల సమీకరణ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నోటీసులు అందుకున్నారు. CID అధికారుల నుంచి ఆయన నోటీసులు తీసుకున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసింది CID. దాని ఆధారంగా ఈ నెల 23వ తేదీ విచారణకు రావాలని, CRPC సెక్షన్ 41 ప్రకారం చంద్రబాబుకు నోటీసు ఇచ్చారు CID అధికారులు.
హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. FIR కాపీని కూడా అందించారు. చంద్రబాబుపై 120-B, 166, 167, 217 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి నారాయణపై SC, ST అట్రాసిటీ కేసు పెట్టారు. ఫిబ్రవరి 24న చంద్రబాబు, నారాయణపై కేసు నమోదు చేసింది CID. అప్పటి గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండేకు 160 CRPC కింద నోటీసులు ఇచ్చారు. ఈ కేసు వివరాలను గుంటూరు 6వ జూనియర్ సివిల్ జడ్జికి అందించింది CID.
చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులో కీలక అంశాలను పేర్కొన్నారు అధికారులు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహకరించాలని, విచారణలో ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ తలదూర్చొద్దని స్పష్టంగా రాశారు. సాక్ష్యులను, ఫిర్యాదుదారులను బెదిరించకూడదని సూచించారు. విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉందని స్పష్టంగా పేర్కొన్నారు.
CID నోటీసు అందుకున్న చంద్రబాబు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. విచారణకు వెళ్లాలా… CID నోటీసుకు ఎలాంటి రిప్లైయ్ ఇవ్వాలన్న దానిపై మాట్లాడుతున్నారు. అమరావతిలోని అసైన్డ్‌భూములను కేసులో చాలా ఆరోపణలే ఉన్నాయి. తక్కువ ధరకు దళితుల భూములను కొట్టేసి… ఆ తర్వాత వాటినే సమీకరణలో తీసుకునేలా జీవోలు ఇచ్చారని, తద్వారా దాదాపు 500 ఎకరాలను ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చి ప్లాంట్లు పొందారనేది ప్రధాన ఆరోపణ.
ఈ కేసులో 1977 ఏపీ అసైన్డ్ ల్యాండ్ చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించారనేది ఆరోపణ. దళితులను భయపెట్టి భూములు లాక్కున్నారని, అతితక్కువ రేటుకు వాటిని దక్కించుకున్నారని CID గుర్తించింది. ఆ భూములనే ల్యాండ్‌పూలింగ్‌కు ఇచ్చి… మళ్లీ ప్లాట్లు తీసుకున్నారని తేల్చింది. ఆ భూములను సమీకరించేలా అనుకూలంగా జీవో ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి.
అసైన్డ్ భూములకు ప్లాట్లు రావని ప్రచారం చేశారని, తద్వారా అమ్మేయాలంటూ దళితులను బెదిరించారనేది ప్రధాన ఆరోపణ. కొల్లి శివరాం 47.39 ఎకరాలను, గుమ్మడి సురేష్ 42.92 ఎకరాలను, బలుసు శ్రీనివాసరావు 14.07 ఎకరాలను కొన్నారని CID గుర్తించింది. అసలు వీళ్లు ఎవరు? ఆనాటి ప్రభుత్వంలో ఉన్న వారికి, వీళ్లకు ఉన్న లింకులు ఏంటి? అన్నదే ఆసక్తి రేపుతోంది. వాళ్లంతా టీడీపీ ప్రభుత్వ పెద్దల బినామీలేనని ఆరోపిస్తోంది వైసీపీ.
Highest Denomination Currency: రూ.2000 నోట్ల ముద్రణపై కేంద్రం కీలక ప్రకటన..
World singles TT qualification: ప్రపంచ సింగిల్స్ టీటీ క్వాలిఫైయర్స్‌లో భారత ఆటగాళ్ల దూకుడు
Oye Bat Dikha: “తొలి అనుభావాన్ని” పంచుకున్న ఇషాన్ కిషన్.. కోహ్లీ చెబితే కానీ అర్థం కాలేదు..