యోగి కంచుకోటలో అఖిలేశ్ అభ్యర్థి!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రతిష్ఠాత్మక గోరఖ్‌పూర్ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ నుంచి రామ్ భువల్ నిషద్‌ పోటీచేయనున్నారని ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. ఎస్పీ-బీఎస్పీ కూటమి నుంచి వైదొలుగుతున్నట్టు నిషద్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. కౌదిరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రామ్ భువల్ నిషద్… ప్రస్తుతం గోరఖ్‌పూర్ రూరల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2007లో బీఎస్పీ చీఫ్ మాయావతి ప్రభుత్వంలో […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:55 pm, Sat, 30 March 19
యోగి కంచుకోటలో అఖిలేశ్ అభ్యర్థి!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రతిష్ఠాత్మక గోరఖ్‌పూర్ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ నుంచి రామ్ భువల్ నిషద్‌ పోటీచేయనున్నారని ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. ఎస్పీ-బీఎస్పీ కూటమి నుంచి వైదొలుగుతున్నట్టు నిషద్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. కౌదిరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రామ్ భువల్ నిషద్… ప్రస్తుతం గోరఖ్‌పూర్ రూరల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2007లో బీఎస్పీ చీఫ్ మాయావతి ప్రభుత్వంలో ఆయన మత్స్యశాఖ మంత్రిగా కూడా పనిచేశారు.

కాన్పూర్ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థి రామ్ కుమార్ పోటీచేయనున్నట్టు సమాజ్ వాదీ పార్టీ ప్రకటించింది. ఎస్పీ-బీఎస్పీ కూటమి నుంచి నిషద్ పార్టీ వైదొలగడంతో… సిట్టింగ్ ఎంపీ ప్రవీణ్ నిషద్ మళ్లీ ఇక్కడి నుంచి బరిలో నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిషద్ పార్టీ అధినేత సంజయ్ నిషద్ కుమారుడైన ప్రవీణ్… గత ఏడాది సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై గోరఖ్‌పూర్‌ పార్లమెంటు ఉపఎన్నికల్లో పోటీచేసి ఘన విజయం సాధించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కంచుకోటగా భావించే గోరఖ్‌పూర్ నియోజక వర్గంలో ఎస్పీ అభ్యర్థి విజయం సాధించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ విజయం అందించిన ఉత్సాహంతో ఎస్పీ-బీఎస్పీ పార్టీలు తాజా ఎన్నికల్లో సైతం కూటమి కట్టాయి.