Divyavani: తెలుగు దేశం పార్టీకి సినీ నటి దివ్యవాణి బిగ్ షాక్.. అంతలోనే యూ టర్న్..

|

May 31, 2022 | 2:57 PM

తెలుగుదేశంలో యాక్టివ్‌గా ఉండే నాయకురాలు, సినీ నటి దివ్య వాని ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. టీడీపీలో కొన్ని దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేసినట్లు..

Divyavani: తెలుగు దేశం పార్టీకి సినీ నటి దివ్యవాణి బిగ్ షాక్.. అంతలోనే యూ టర్న్..
Divyavani
Follow us on

తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ఒకసారి పోస్ట్ ట్వీట్‌.. కొద్ది సమయంలోనే యూ టర్న్ తీసుకున్నారు. ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి, సినీ న‌టి దివ్య‌వాణి నిమిషాల వ్య‌వధిలోనే తొల‌గించేశారు. అంతేకాకుండా తాను టీడీపీని వీడే ప్ర‌సక్తే లేదని విస్ప‌ష్టంగా ప్ర‌క‌టించారు. మంగళవారం సాయంత్రం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యం నుండి ఆమె మీడియాతో మాట్లాడ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగిదంటే.. ముందుగా తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. అందులో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి ప్రకటించారు. తెలుగుదేశంలో యాక్టివ్‌గా ఉండే నాయకురాలు, సినీ నటి దివ్య వాని ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. టీడీపీలో కొన్ని దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు దివ్య వాణి. మహానాడు తర్వాత ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీడీపీలో కొందరి తీరుపై తీవ్ర విమర్శలు చేశారు దివ్య వాణి. పార్టీలో దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంతవరకు తనను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. మహానాడులో అవమానం జరిగినట్లు రెండు రోజుల కిందట ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

పార్టీ మహానాడులో తనకు ఘోర అవమానం జరిగిందని.. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని దివ్యవాణి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి నిస్వార్థంగా సేవ చేస్తున్నా గుర్తింపే లేదని అన్నారు. ఓ కళాకారుడు (దివంగత ఎన్‌టీఆర్‌) పెట్టిన పార్టీలో క‌ళాకారుల‌కు స్థానం లేక‌పోవ‌డం ఆవేద‌న‌కు గురి చేస్తోంద‌న్నారు. ఈ క్రమంలో మంగళవారం దివ్యవాణి అనూహ్యంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఆమె అధికార పార్టీ వైసీపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.