PM Narendra Modi: ప్రధాని మోదీ తొలి వ్యాక్సిన్ షాట్ తీసుకోవాలి, ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలి, కాంగ్రెస్ డిమాండ్
ఇండియాలో రెండు కరోనా వైరస్ వ్యాక్సిన్లు రావడం హర్షణీయమేనని, అయితే వీటిపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని బీహార్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే అజిత్ శర్మ..

First Shot Of Vaccine: ఇండియాలో రెండు కరోనా వైరస్ వ్యాక్సిన్లు రావడం హర్షణీయమేనని, అయితే వీటిపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని బీహార్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే అజిత్ శర్మ అన్నారు. అందువల్ల వారిలో ఈ అనుమానాలు పోగొట్టడానికి ప్రధాని మోదీ మొట్టమొదట తానే తొలి టీకామందు తీసుకోవాలని ఆయన సూచించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు కానున్న జో బైడెన్ పబ్లిక్ గా అందరిముందు వ్యాక్సిన్లు తీసుకున్నారని, అలా పలువురు నేతలకు ఆదర్శమయ్యారని ఆయన చెప్పారు. సీనియర్ బీజేపీ నేతలు కూడా తొలి వ్యాక్సిన్ షాట్ ఎందుకు తీసుకోరని ఆయన ప్రశ్నించారు. సీరం, భారత్ బయోటెక్ సంస్థలు ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లను బీజేపీ తమ క్రెడిట్ గా చెప్పుకుంటున్నాయని, కానీ నిజానికి ఈ రెండు కంపెనీలు కాంగ్రెస్ హయాంలో ఏర్పడ్డాయని అజిత్ శర్మ పేర్కొన్నారు. అందువల్ల ఈ క్రెడిట్ తమకే దక్కాల్సి ఉంటుందన్నారు.
ఇప్పటికే భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ పై సీనియర్ కాంగ్రెస్ నేతలు పలు అనుమానాలను వ్యక్తం చేసిన తరుణంలో ఈ నేత ఇలా కొత్త డిమాండును తెరపైకి తేవడం విశేషం.
Also Read :
Corona Virus Effect: దేశంలో తగ్గుతున్న కరోనా ప్రభావం.. గణనీయంగా పడిపోయిన మరణాల సంఖ్య..
World Braille Day: బ్రెయిలీ లిపి దినోత్సవం నేడు.. అసలు అంధులకర్థమయ్యే భాష ఎలా పుట్టిందో తెలుసా?