World Braille Day: బ్రెయిలీ లిపి దినోత్సవం నేడు.. అసలు అంధులకర్థమయ్యే భాష ఎలా పుట్టిందో తెలుసా?

కళ్ళు కనిపించని వారికి భవిష్యత్ పై ఆశలు కల్పిస్తూ ... లూయిస్ బ్రెయిలీ జ్ఞాన జ్యోతిని వెలిగించారు. కేవలం స్పర్శతోనే అక్షరాలను గుర్తు పట్టి..

World Braille Day: బ్రెయిలీ లిపి దినోత్సవం నేడు.. అసలు అంధులకర్థమయ్యే భాష ఎలా పుట్టిందో తెలుసా?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 04, 2021 | 3:00 PM

World Braille Day: కళ్ళు కనిపించని వారికి భవిష్యత్తుపై ఆశ కల్పిస్తూ… లూయిస్ బ్రెయిలీ జ్ఞాన జ్యోతిని వెలిగించారు. కేవలం స్పర్శతోనే అక్షరాలను గుర్తు పట్టి.. అంధులకు ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకునే విధంగా ఓ భాషను కనిపెట్టారు లూయిస్ బ్రెయిలీ. దీంతో ఎందరో అంధులు చదువుకుంటున్నారు.  మంచి మంచి పదవులను చేపట్టి తాము ఎవరికీ ఏ విధంగా తీసిపోము అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాడు తూర్పుగోదావరి జిల్లా మల్కిపురం మండలం గూడపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు. పుట్టుకతోనే అంధుడైన కట్టా సింహాచలం పట్టుదలతో చదువుకున్నారు. ధృడ సంకల్పంతో ముందుకు సాగి.. 2018 ఐఏఎస్ బ్యాచ్ లో 457వ ర్యాంకు సాధించారు. ముస్సోరీలో శిక్షణ పొందిన సింహాచలం సొంత రాష్ట్రమైన ఏపీలోనే ఐఏఎస్ గా పనిచేస్తున్నారు. అంతేకాదు కేరళలోని ఎర్నాకుళం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రాంజల్ , ప్రముఖ గాయని గాయత్రి శంకరన్ వంటి వారు అనేక మంది చీకటిని జయించి విద్యావంతులుగా, ఉద్యోగులుగా రాణిస్తున్నారు.

అయితే జనవరి 4న లూయిస్ బ్రెయిలీ జయంతిని వరల్డ్ బ్రెయిలీ డే గా జరుపుకుంటున్నాం. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ బ్రెయిలీ డేను అధికారంగా గుర్తించినప్పటి నుంచి జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఫ్రెంచ్ విద్యావేత్త అయిన లూయిస్ 1809 లో జన్మించారు. తన నాల్గగవ  ఏట ఓ ప్రమాదంలో చూపుతో పాటు.. రెండు కాళ్ళను పోగొట్టుకున్నారు. కాళ్లు, కళ్ళు కోల్పోయిన లూయిస్ అధైర్య పడలేదు.. పారిస్‌లో అంధులకు చదువు చెప్పే ఓ పాఠశాలలో చేరారు. అక్కడ అంధులకు లావుగా ఎత్తుగా ఉండే అక్షరాలతో..  విద్యనభ్యసిస్తూ.. విద్యార్థిగా మంచి ప్రతిభను కనబరిచారు. అదే స్కూల్ లో 17 ఏళ్ల వయసులోనే టీచర్ గా చేరారు. అయితే “తాను అంధుడిగా నేర్చుకున్న అక్షరాల కూర్పులో ఏదో లోపం ఉందని భావించిన లూయిస్.. అంధులు లిపిని సులభంగా నేర్చుచుకునేలా పరిశోధనలు” చేశారు.. “అక్షరాలను చుక్కల కూర్పుతో అంధులు గుర్తు పట్టేలా ‘బ్రెయిలీ లిపి’ని సృష్టించారు”.. దీంతో కంటి చూపులేని వారు చదువుకోవడం మరింత సులభంగా మారింది.

అప్పటి నుంచి ప్రపంచంలో అనేక పుస్తకాలను బ్రెయిలీ లిపిలో ముద్రిస్తున్నారు. భగవద్గీత వంటి అనేక గ్రంధాలు కూడా బ్రెయిలీ లిపిలో ముద్రించారు. ఇక యునెస్కో గుర్తింపు పొందిన ప్రాంతాల్లో బ్రెయిలీ లిపిలో సమాచారం ఉండడం తప్పని సరిచేసింది. ఈరోజు అంధులు చదువుకోవడానికి జ్ఞానం సంపాదించడానికి కారణమైన లూయిస్ కృషి ని గుర్తిస్తూ వరల్డ్ బ్రెయిలీ డే గా జరుపుకుంటున్నాం. ఆయన స్మృతిలో భారత ప్రభుత్వం లూయిస్ బ్రెయిలీ బొమ్మతో రెండు రూపాయల కాయిన్ కూడా రిలీజ్ చేసింది.

Also Read: తెలంగాణలో కరోనా తీవ్రత తక్కువే.. పాజిటివ్ కేసుల రేటు 3.8 శాతం.. శీతకాలం మరింత అప్రమత్తంగా ఉండాలన్న ఆరోగ్యశాఖ