- Telugu News Photo Gallery Worshiping the conch like this will reduce financial problems, Check Here is Details in Telugu
Diwali 2024: దీపావళికి ముందే మీ ఇంట్లో శంఖాన్ని తీసుకొస్తే.. ధనలక్ష్మి విడిచి పోదు..
పూజల్లో శంఖానికి ఉండే ప్రాధాన్యతే వేరు. ముఖ్యంగా పరమ శివుడికి శంఖం అంటే చాలా ప్రీతికరం. లక్ష్మీ దేవికి కూడా శంఖం అంటే ప్రీతికరం. అందుకే శంఖాన్ని పూజించే వారిపై తన కటాక్షాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. క్షీర సాగర మథనం నుండి బయటకు వచ్చిన వాటిల్లో శంఖం కూడా ఒకటి. ఇంట్లో శంఖాన్ని ఈ దిక్కులో పెడితే చాలా మంచిది. శంఖాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మీకు ఎంతో మంచి జరుగుతుంది. శంఖ పూజ వల్ల ఇంట్లో..
Updated on: Oct 09, 2024 | 5:10 PM

పూజల్లో శంఖానికి ఉండే ప్రాధాన్యతే వేరు. ముఖ్యంగా పరమ శివుడికి శంఖం అంటే చాలా ప్రీతికరం. లక్ష్మీ దేవికి కూడా శంఖం అంటే ప్రీతికరం. అందుకే శంఖాన్ని పూజించే వారిపై తన కటాక్షాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. క్షీర సాగర మథనం నుండి బయటకు వచ్చిన వాటిల్లో శంఖం కూడా ఒకటి.

ఇంట్లో శంఖాన్ని ఈ దిక్కులో పెడితే చాలా మంచిది. శంఖాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మీకు ఎంతో మంచి జరుగుతుంది. శంఖ పూజ వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. శంఖాన్ని పూరించడం వల్ల అనుకోని అదృష్టాలు మీకు కలుగుతాయి.

శంఖాన్ని ఇంట్లో తూర్పు దిశలో పెట్టి పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఈ దిక్కులో శంఖాన్ని ఉంచి పూజిస్తే.. మీపై లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు.

శంఖాన్ని భద్రపరిచే స్థలం ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఎరుపు లేదా పసుపు రంగు క్లాత్‌పై శంఖాన్ని ఉంచడం మంచిది. అలాగే శంఖాన్ని పూరించిన తర్వాత గంగా జలంతో శుభ్రం చేసి తుడవాలి.

ఈ దీపావళి పండుగ కంటే ముందే ఇంట్లోకి శంఖాన్ని తీసుకొచ్చి పెట్టుకోండి. దీని వలన మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. శంఖం ఎప్పుడూ పైకి చూసేలా ఉంచుకోవాలి. శంఖం నుంచి వెలువడే సానుకూల శక్తి ఇంటి మొత్తం వ్యాపిస్తుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




