AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Lip Care Tips: శీతాకాలంలో పెదాల సంరక్షణకు ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి..

మేకప్ వేసుకోవడం ఇష్టం లేని వారు కూడా పెదాలకు రంగుల లిప్‌స్టిక్‌లు వేసుకోవడానికి ఇష్టపడతారు. కొన్నిసార్లు దుస్తులకు సరిపోయేవి, మరి కొన్నిసార్లు ట్రెండ్‌ని అనుసరించడం ద్వారా లిప్‌స్టిక్‌ రంగును ఎంచుకుంటారు. ప్రస్తుతం నో మేకప్ లుక్ ట్రెండ్ నడుస్తోంది. న్యూడ్ షేడ్స్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల పెదవులు పగిటినట్లు అనిపిస్తాయి. ఎందుకో తెలుసా?

Srilakshmi C
|

Updated on: Dec 03, 2023 | 12:21 PM

Share

1 / 5
మీ పెదవుల రంగు ముదురు రంగులో ఉంటే లేత రంగు లిప్‌స్టిక్‌లు సరిపోవు. అలాగే పగిలిన పెదవులకు కూడా లిప్ స్టిక్ అంతగా బావుండదు. పొడి వాతావరణంలో పెదవులు తేమను కోల్పోతాయి. అందువల్లనే చలికాలం రాగానే పెదాలు పగలడం మొదలవుతుంది. శీతాకాలంలో పెదాల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పెదవులు వాడిపోతాయి. పెదవుల రంగు నల్లగా మరి అందవిహీనంగా కనిపిస్తాయి.

2 / 5
సరైన న్యూడ్ లిప్‌స్టిక్‌ను ఎంచుకోవడం కంటే మంచి నాణ్యమైన లిప్ బామ్‌ను ఉపయోగించడం చాలా ముఖ్యం. రోజూ లిప్ బామ్ వాడటం వల్ల పెదాలు ఎప్పటికీ పొడిబారవు. పెదవులు ఎల్లప్పుడూ తేమగా ఉంటాయి. పెదవులపై చర్మం చాలా పలుచగా ఉండటం వల్ల చలికాలంలో పెదవులు త్వరగా పొడిబారిపోతాయి.

3 / 5
బీట్‌రూట్ రసంలో 1 చెంచా చక్కెర, కొబ్బరి నూనె వేసి కలుపుకోవాలి. దానిలో విటమిన్ ఇ క్యాప్సూల్ కూడా ఒకటి కలపవచ్చు. ఇలా తయారు చేసుకున్న బీట్‌రూట్ లిప్‌ స్క్రబ్‌ని పెదవులపై అప్లై చేయాలి. ఇది పెదవులపై పేరుకుపోయిన ట్యాన్‌ని శుభ్రపరుస్తుంది. అంతేకాదు పెదవుల నలుపు కూడా వదిలి పోతుంది. తర్వాత బీట్ రూప్‌ లిప్ బామ్‌ను పెదవులకు అప్లై చేయాలి.

4 / 5
ఎండలోకి వెళ్లేటప్పుడు పెదవులకు కొద్దిగా సన్‌స్క్రీన్ రాసుకోవాలి. సూర్యరశ్మికి గురికావడం వల్ల పెదవుల రంగు మారదు. ధూమపాన అలవాటును కూడా మానేయాలి. ఈ అలవాటు పెదవుల రంగును మరింత దిగజారుస్తుంది.

5 / 5