Beetroot Juice: అమ్మాయిల ఆరోగ్యానికి శ్రీరామ రక్ష ఈ జ్యూస్..! రోజుకో గ్లాసుడు తాగారంటే చిక్కులన్నీ పరార్..
బీట్‌రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బీట్‌రూట్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో కాల్షియం, భాస్వరం ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా బీట్‌రూట్ మహిళల ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపకరిస్తుంది. ఇందులోని పోషకాలు..
Updated on: Aug 10, 2025 | 6:28 AM

చాలా మంది అమ్మాయిలు తమ చర్మం గులాబీ రంగులో ఉండాలని కోరుకుంటారు. మీకు కూడా గులాబీ రంగులో మెరిసే చర్మాన్ని కావాలని కోరుకుంటే వెంటనే ఈ కూరగాయతో ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. కొన్ని రోజుల్లోనే భలే మార్పు చూస్తారు.

రక్త పరిమాణాన్ని పెంచడంలో సహాయపడుతుంది. బీట్‌రూట్‌లో ఐరన్ మహిళల్లో రక్తహీనతను తొలగించడంలో భలేగా పని చేస్తుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. బీట్‌రూట్‌లోని యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి.

పీరియడ్స్ సమయంలో నొప్పిని తగ్గిస్తుంది. బీట్‌రూట్‌లోని శోథ నిరోధక లక్షణాలు ఈ సమయంలో సంభవించే కడుపు నొప్పి, వాపును తగ్గిస్తాయి. బీట్‌రూట్‌లో నైట్రేట్లు కూడా ఉంటాయి. ఇవి శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. అలసట నుంచి ఉపశమనం కలిగిస్తాయి. శక్తిని పెంచుతాయి.

బీట్‌రూట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని పోషకాలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బీట్‌రూట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.




