AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: బంగారం కొంటున్నారా.. 18 క్యారెట్ల గోల్డ్ ట్రెండ్ గురించి తెలుసా..? ఇలా చేస్తే పైసలు సేవ్..

భారతీయుల జీవితాల్లో బంగారం ఓ భాగమైపోయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధరలు ఆకాశాన్నంటుతుండటంతో.. ప్రజలు ఆభరణాల కోసం 18 క్యారెట్ల బంగారాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇది కేవలం ఆర్థిక కారణాల వల్ల మాత్రమే కాదు.. దీనిలో ఉన్న ఆచరణాత్మక లాభాల వల్ల కూడా. ఈ బంగారం ఆభరణాలు తక్కువ ధరలో లభించడమే కాకుండా ఎక్కువ మన్నికను కలిగి ఉంటాయి.

Krishna S
|

Updated on: Sep 14, 2025 | 1:53 PM

Share
18 క్యారెట్ల బంగారంలో 75శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. మిగిలిన 25శాతం రాగి, వెండి, జింక్ వంటి లోహాలు కలిపి ఉంటాయి. ఈ మిశ్రమం వల్ల బంగారానికి బలం పెరుగుతుంది. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం చాలా మృదువుగా ఉంటుంది. దానితో సంక్లిష్టమైన డిజైన్‌లు చేయడం కష్టం. కానీ 18 క్యారెట్ల బంగారం గట్టిగా ఉండడం వల్ల నగల వ్యాపారులు సులభంగా, వంగిపోకుండా, విరిగిపోకుండా ఉండే డిజైన్‌లను తయారు చేయవచ్చు.

1 / 5
ఇతర లోహాలను కలపడం వల్ల ఆభరణాల రంగు కూడా మారుతుంది. రాగి కలిపినప్పుడు ఎరుపు రంగు వచ్చి రోజ్ గోల్డ్ తయారవుతుంది. వెండి కలిపితే మరింత మెరుపుతో కూడిన లేత రంగు వస్తుంది. ఈ రంగుల వైవిధ్యం వల్ల 18 క్యారెట్ల బంగారం ఆధునిక డిజైన్లకు, ముఖ్యంగా వజ్రాలు, రత్నాలతో కూడిన ఆభరణాలకు సరైన ఎంపికగా మారింది.

2 / 5
సాధారణంగా 24 క్యారెట్ల బంగారాన్ని పెట్టుబడి కోసం కడ్డీలు, నాణేల రూపంలో కొనుగోలు చేస్తారు. కానీ రోజువారీగా ధరించడానికి, ముఖ్యంగా ఫ్యాషన్, మన్నిక కోరుకునే వారికి 18 క్యారెట్ల బంగారం ఆదర్శంగా మారింది. ఇది బరువుగా ఉండే వివాహ నెక్లెస్‌ల నుండి తేలికపాటి ఆభరణాల వరకు అన్ని రకాల డిజైన్లలో అందుబాటులో ఉంటుంది.

3 / 5
"పండుగ సీజన్‌కు ముందు 18 క్యారెట్ల బంగారానికి డిమాండ్ గణనీయంగా పెరిగింది. యువ కస్టమర్లు ఫ్యాషన్, విలువ రెండూ కోరుకుంటున్నారు. కాబట్టి చెవిపోగులు, ఉంగరాలు, గాజులు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి" అని ఓ వ్యాపారి అన్నారు.

4 / 5
ప్రస్తుతం హాల్‌మార్కింగ్ తప్పనిసరి కావడంతో వినియోగదారులు 18 క్యారెట్ల బంగారానికి సంబంధించిన BIS హాల్‌మార్క్ చూసి దాని స్వచ్ఛతను నిర్ధారించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

5 / 5
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే

వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..

వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్

ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్

బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు

సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..

ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..

శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ