- Telugu News Photo Gallery What should be done to prevent children from getting fever at night? Check details in Telugu
Children’s Care: రాత్రిపూట పిల్లలకు ఫీవర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి!
వాతావరణంలో మార్పులు రావడం సహజం. ఇలా వాతావరణాలు మారినప్పుడల్లా పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. దానికి తోడు శీతా కాలంలో మరిన్ని రోగాలు దాడి చేసే అవకాశం ఉంది. ఇలా వెదర్ మారినప్పుడల్లా పెద్దలకే కాకుండా పిల్లలకు కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. జలుబు, జ్వరం, దగ్గు వంటివి ఎటాక్ చేస్తాయి. ముఖ్యంగా రాత్రుళ్లు జ్వరం ఎక్కువగా వస్తుంది. రాత్రి పూట పిల్లలకు జ్వరం రావడానికి అనేక కారణాలు..
Chinni Enni | Edited By: Ram Naramaneni
Updated on: Dec 25, 2023 | 10:05 PM

వాతావరణంలో మార్పులు రావడం సహజం. ఇలా వాతావరణాలు మారినప్పుడల్లా పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. దానికి తోడు శీతా కాలంలో మరిన్ని రోగాలు దాడి చేసే అవకాశం ఉంది. ఇలా వెదర్ మారినప్పుడల్లా పెద్దలకే కాకుండా పిల్లలకు కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. జలుబు, జ్వరం, దగ్గు వంటివి ఎటాక్ చేస్తాయి. ముఖ్యంగా రాత్రుళ్లు జ్వరం ఎక్కువగా వస్తుంది.

రాత్రి పూట పిల్లలకు జ్వరం రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇన్ ఫెక్షన్లు కారణం అవ్వొచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ ఫెక్షన్, న్యుమోనియా వంటివి ఉంటే పిల్లలకు రాత్రి జ్వరం వస్తుంది. కొంత మంది పిల్లలకు రాత్రి వస్తే.. ఇంకొంత మందికి మధ్యాహ్నం వస్తుంది. ఇలా జ్వరం వచ్చినప్పుడు ముక్కు కారండం, అసౌకర్యంగా, చిరాకుగా ఉంటుంది.

చెవిలో ఇన్ ఫెక్షన్స్ ఉన్నా కూడా పిల్లలకు ఫీవర్ వస్తుంది. ఇన్ ఫెక్షన్స్ పెరిగే కొద్దీ రోగ నిరోధక శక్తి అనేది తగ్గి పోతుంది. అందుకే రాత్రి పూట జ్వరం వస్తుంది. అలాగే జీర్ణ కోశ ఇన్ ఫెక్షన్స్ ఉన్నా కూడా ఫీవర్ అనేది వస్తుంది.

పిల్లలకు దంతాలు వచ్చేటప్పుడు కూడా విరేచనాలు, వాంతులు, జ్వరం అనేవి వస్తాయి. అంతే కాకుండా ఈ సమయంలో పిల్లల నిద్ర సమయం కూడా మారుతుంది. కాబట్టి జ్వరం, నిద్ర సమస్యలతో పిల్లలు చిరాకు చేస్తారు.

పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు వీలైనంత వరకూ వాళ్లు శుభ్రంగా ఉండేలా చూడండి. బయట నుంచి వచ్చాక కాళ్లూ, చేతులు కడుక్కోవడం నేర్పించండి. పిల్లల వయసు ప్రకారం తప్పకుండా టీకాలు వేయించండి. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులని సంప్రదించడం మేలు. జ్వరం, జలుబు, దగ్గు ఉన్న ఇతర పిల్లల నుంచి దూరంగా ఉంచండి. పోషకాలు ఉన్న ఆహారాన్ని అందించండి.





























