- Telugu News Photo Gallery What is the meaning of If you see these things in dream according to swapna shastra
Spirituality Tips: మీ కలలో ఇవి కనిపించాయా.. అయితే వాటి అర్థం ఇదే!
నిద్రలో ఎన్నో కలలు వస్తూంటాయి. అయితే వాటిల్లో గుర్తుకు ఉండేవి కొన్నే. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని పెద్దలు కూడా చెబుతూంటారు. అలాగే నిద్రలో వచ్చే కలలకు కొన్ని అర్థాలు కూడా ఉన్నాయని పెద్దలు అంటారు. మరోవైపు స్వప్న శాస్త్రం కూడా కలలకు అర్థాలు ఉన్నాయని చెబుతోంది. ఒకోసారి నిజంగానే చాలా వింత కలలు వస్తాయి. ఇంకోసారి భయానక కలలు, నవ్వడం, ఏడుపు ఇలా చాలా రకరకాల కలలు వస్తాయి. మరి కలలో ఏవి కనిపిస్తే మంచివి..
Updated on: Nov 30, 2023 | 3:00 PM

నిద్రలో ఎన్నో కలలు వస్తూంటాయి. అయితే వాటిల్లో గుర్తుకు ఉండేవి కొన్నే. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని పెద్దలు కూడా చెబుతూంటారు. అలాగే నిద్రలో వచ్చే కలలకు కొన్ని అర్థాలు కూడా ఉన్నాయని పెద్దలు అంటారు. మరోవైపు స్వప్న శాస్త్రం కూడా కలలకు అర్థాలు ఉన్నాయని చెబుతోంది. ఒకోసారి నిజంగానే చాలా వింత కలలు వస్తాయి. ఇంకోసారి భయానక కలలు, నవ్వడం, ఏడుపు ఇలా చాలా రకరకాల కలలు వస్తాయి. మరి కలలో ఏవి కనిపిస్తే మంచివి.. ఏవి కనిపిస్తే నష్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కలలో ఒక్కోసారి దేవాలయాలు, దేవుడి ఫొటోలు, పూజలు చేస్తున్నట్లు ఇలా కలలు వస్తే.. భగవంతుని ఆశీస్సులు మీపై ఉంటాయని అర్థం. అలాగే దేవ దూతలు, వివాహిత పురుషులు, ముద్దు వంటి కలలు కనిపిస్తే శుభ సూచికం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని అర్థం.

అలాగే కలలో తల్లిదండ్రులు, చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఏనుగులు కనిపిస్తే త్వరలోనే మీకు ఐశ్వర్యం కలుగుతుంది. మీ ముఖం అద్దంలో చూస్తున్నట్లు, ఆకులు, కాయలు తింటున్నట్లు, చంద్రుడు కనిపిస్తే.. మీ జీవితంలో సంతోషం, శాంతి కలుగుతాయని సంకేతం.

తలకు నూనె రాస్తున్నట్టు, నక్షత్రాలు భూమిపైకి రాలుతున్నట్లు కలలు వస్తే అది మీ మరణానికి సంకేతంగా స్వప్న శాస్త్రం చెబుతోంది. చీమలు, పాములు, కాకులు, నక్కలు కరిచినట్లు కల వస్తే అది మీకు పితృదోషం ఉన్నట్లు సూచన.

మీరు ఆస్పత్రిలో ఉన్నట్లు, దెబ్బలు తగిలినట్లు, ఎవరో మిమ్మల్ని కొట్టినట్టు కల వస్తే మాత్రం.. మీకు అనారోగ్య సమస్యలు కలుగుతాయని సంకేతంగా భావించవచ్చు. అలాగే సముద్రం, అడవులు, సూర్యాస్తమయం, వరదలు, కొండపై నుండి పడిపోవడం వంటి కలలు వస్తే జీవితంలో పలు సమస్యలు వస్తాయనేదానికి సంకేతం.




