ప్రపంచంలోనే అత్యంత విలువైన, అరుదైన వజ్రం.. ధర ఎంతో తెలుసా..?
దీని అసలు రూపం 132.5 క్యారెట్ల బరువున్న ఒక అన్‌కట్ రాయి, దీనిని డి బీర్స్ 1999లో తవ్వింది. దాని ప్రత్యేకమైన లక్షణాలకు ప్రసిద్ధి చెందిన ఇది దాదాపు రెండు సంవత్సరాల పాటు జాగ్రత్తగా కటింగ్ మరియు పాలిషింగ్ చేయించుకుంది మరియు 59.60 క్యారెట్ల అంతర్గతంగా దోషరహిత ఫాన్సీ వివిడ్ పింక్ డైమండ్‌గా ఉద్భవించింది. వేలంలో అమ్ముడైన అత్యంత ఖరీదైన వజ్రంగా, పింక్ స్టార్ ఖచ్చితంగా తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది. దీనికి సాటిలేని రంగు, స్పష్టత, పరిమాణం, కట్ ఉన్నాయి. కానీ, ప్రపంచంలోనే అత్యంత విలువైన, అరుదైన వజ్రం ఖరీదు ఎంతో తెలుసా..?
Updated on: Sep 17, 2025 | 12:35 PM

ప్రపంచంలోనే అత్యంత విలువైన, అరుదైన వజ్రం కోహినూర్. వజ్రం కోసం చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. కోహినూరు వజ్రం చరిత్ర చుట్టూ కూడా ఎన్నో వివాదాలు ఉన్నాయి. అయితే, భారత్‌లోని తెలుగు నేలపై దొరికిన ఈ వజ్రం ఎన్నో రాజవంశాల చేతులు మారింది.

ఇది 105.6 క్యారెట్లు .. 21.12 గ్రాముల బరువు ఉంటుంది. కోహినూర్ వజ్రం పుట్టింది కృష్ణా తీరంలో ఉన్న కోల్లూరు గనులలో అని చరిత్రకారులు చెబుతున్నారు. కోహినూర్ అంటే అర్థం కాంతి... వెలుగు పర్వతం అని అర్థం. ఈ వజ్రం పర్షియన్, మొఘల్ పాలకుల ద్వారా బ్రిటిష్ పాలకుల వద్దకు చేరింది.

1851లో కోహినూరు లండన్‌లోని గ్రేట్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఆ ప్రదర్శన తర్వాత దాని రూపాన్ని మెరుగుపరచడానికి రాయిని కత్తిరించి పాలిష్ చేశారు. కోహినూరును కత్తిరించి పాలిష్ చేసిన తర్వాత అది కిరీట ఆభరణాల్లో భాగమైంది. క్వీన్ విక్టోరియా దీనిని గౌన్‌కు కుడివైపున బ్రోచ్‌గా ధరించారు.

ఈ వజ్రం పర్షియన్, మొఘల్ పాలకుల ద్వారా బ్రిటిష్ పాలకుల వద్దకు చేరింది. ఈ వజ్రం బ్రిటన్ రాజు ప్రిన్స్ చార్లెస్ దగ్గర ఉంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఈ వజ్రం ధర ఎంతో తెలుసా? కోహినూర్ వజ్రం అమ్మదగినది కాదు ఇది అమూల్యమైనదిగా పరిగణిస్తారు.

ఒక నివేదిక ప్రకారం దీని ధర దాదాపు 500 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. భారతీయ కరెన్సీలో దాదాపు 8 నుంచి 16 వేల కోట్ల రూపాయలు. కోహినూర్ ని బ్రిటన్ నుంచి తిరిగి తీసుకురావడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తోంది భారత్.




