- Telugu News Photo Gallery What are the astrological benefits of wearing gold? check here is details in Telugu
Vastu Tips: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారం ధరించడం వల్ల లాభాలు ఏంటి?
బంగారానికి ఎవరైనా సరే అత్యంత విలువను ఇస్తారు. మహిళల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే విధంగా బంగారాన్ని పవిత్రంగా కూడా పరిగణిస్తారు. ఖరీదైన లోహంగా కూడా బంగారానికి పేరు. బంగారం ధరించడం వల్ల కూడా శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. బంగారాన్ని సూర్యుని లోహంగా పరగిణిస్తారు. బంగారం నుంచి వెలువడే శక్తి కారణంగా శరీరంతో పాటు మెదడును కూడా ప్రభావవంతంగా మార్చుతుంది. శరీరానికి శక్తిని..
Updated on: Jan 24, 2024 | 6:20 PM

బంగారానికి ఎవరైనా సరే అత్యంత విలువను ఇస్తారు. మహిళల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే విధంగా బంగారాన్ని పవిత్రంగా కూడా పరిగణిస్తారు. ఖరీదైన లోహంగా కూడా బంగారానికి పేరు. బంగారం ధరించడం వల్ల కూడా శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు.

బంగారాన్ని సూర్యుని లోహంగా పరగిణిస్తారు. బంగారం నుంచి వెలువడే శక్తి కారణంగా శరీరంతో పాటు మెదడును కూడా ప్రభావవంతంగా మార్చుతుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది బంగారం.

Gold Price

గోల్డ్ రింగ్ పెట్టుకోవడం వల్ల ఏకాగ్రత, స్పష్టత పెరుగుతుంది. జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో కూడా బంగారం మీకు సహాయ పడుతుంది. బంగారం భావోద్వేగాలను సమతుల్యం చేసే శక్తిని కూడా ఇస్తుంది. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

బంగారాన్ని గురు గ్రహం లోహంగా చెబుతారు. జాతకంలో గురు గ్రహం బలహీనంగా ఉంటే.. ఏపనిలో కూడా విజయం సాధించలేరు. కానీ గోల్డ్ రింగ్ ధరించడం వల్ల గురు గ్రహం బలపడటంతో పాటు ఇతర గ్రహాలు కూడా బలోపేతం కావడానికి వీలుంటుంది.




