- Telugu News Photo Gallery Weight Loss Tips: You Can Add These Winter Foods To Your Diet To Lose Weight
Weight Loss Food: జిమ్‌లలో గంటల తరబడి కసరత్తులు చేయకుండానే సులువుగా బరువు తగ్గాలంటే..
నేటి కాలంలో ఊబకాయం పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. బరువు తగ్గడానికి రకరకాల ప్రక్రియలు అవలంభిస్తుంటారు. జిమ్‌లకు వెళ్లి కసరత్తులు చేస్తూ చాలా కష్టపడిపోతుంటారు. నిజానికి మనం తినే ఆహారం బరువుపై అతి పెద్ద ప్రభావం చూపుతుంది. పండ్లతో సులువుగా ఇలా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.. బేరిపండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రుచిగా ఉండే బేరిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు..
Updated on: Oct 18, 2023 | 9:09 PM

నేటి కాలంలో ఊబకాయం పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. బరువు తగ్గడానికి రకరకాల ప్రక్రియలు అవలంభిస్తుంటారు. జిమ్‌లకు వెళ్లి కసరత్తులు చేస్తూ చాలా కష్టపడిపోతుంటారు. నిజానికి మనం తినే ఆహారం బరువుపై అతి పెద్ద ప్రభావం చూపుతుంది. పండ్లతో సులువుగా ఇలా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

బేరిపండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రుచిగా ఉండే బేరిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు పెరగకుండా నిరోధించడంలో సహాయపడతాయి.

సిట్రస్ పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. విటమిన్ సి నుంచి శరీరానికి సరిపడా శక్తిని పొందవచ్చు. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. నిమ్మ, నారింజ, టాంజెరిన్, కివీ ఫ్రూట్ మొదలైన పండ్లను ఎక్కువగా తినాలి.

బరువు తగ్గాలని ప్రయత్నించేవారికి ఆరెంజ్‌లలో మంచి ఎంపిక. ఇవి తినడం వల్ల శరీరంలోని కొవ్వును సులువుగా తగ్గించుకోవచ్చు. అధిక సమయం ఆకలి వేయకుండా నిరోధించి కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

పొద్దుతిరుగుడు విత్తనాలలో ఫోలేట్, ప్రొటీన్లు, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి అవసరమైన మెగ్నీషియం, సెలీనియం, విటమిన్ ఇ లను అందిస్తుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు బరువు తగ్గడానికి మంచి ఎంపిక. ఇందులోని విటమిన్ ఇ ఆహారం తినాలనే కోరికలను నివారించడానికి సహాయపడుతుంది. పొద్దుతిరుగుడు విత్తనాలను రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తినొచ్చు.




