- Telugu News Photo Gallery Walking Barefoot on Grass: Discover Surprising Health Benefits of Grounding
Barefoot Walking: ఏంటీ రోజూ కాసేపు చెప్పుల్లేకుండా వాకింగ్ చేస్తే ఇన్ని ప్రయోజనాలా?..
ప్రజెంట్ ఫాస్ట్ లైఫ్ ఎలా మారిపోయిందంటే.. బయటకెళ్లినప్పుడంటే ఓకే.. కానీ కొందరైతే ఇంట్లో ఉన్నపుడు కూడా చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు. పడుకునేప్పుడు, తినేప్పుడు మినహా చెప్పులు, షూ లేకుండా ఉండట్లేదు.. కానీ చెప్పులు లేకుండా రోజు కొంత సేపు కాలి నేలపై నడవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా.. అయితే తెలుసుకుందాం పదండి.
Updated on: Aug 07, 2025 | 7:22 PM

కాళ్ళలోని కండరాలు బలంగా ఉన్నప్పుడు అవి అందంగా కనిపిస్తాయి. అయితే ఇలా మన కాళల్లోని కండరాలు బలంగా ఉండాలంటే రోజు కొద్దిసేపు చెప్పులు లేకుండా నేల, గడ్డిపై నడవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

మనం చెప్పులు లేకుండా నేల, గడ్డిపై నడిచేటప్పుడు మన అరికాళ్ళపై పడే ఒత్తిడి నరాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇది మన కంటి ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు మానసిక ప్రశాంతతను పొందడంలో కూడా సహాయపడుతుంది.

అలాగే ఇలా కాలి కాళ్లతో నడవడం మన గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. నడక మన హాట్‌బీట్ రేటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది, శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడం, హార్మోన్ల మార్పులను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇవి శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.

మీరు సరిగ్గా నిద్రపోలేకపోతే, పడుకునే ముందు కొద్ది సేపు మీరు గడ్డి మీద లేదా పెరట్లోని రాళ్ల మధ్య నడవవచ్చు. ఇలా నడవడం వల్ల మీ రక్త ప్రసరణ మెరుగుపడి.. మీరు శ్రద్దగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

అంతేకాకుండా రోజూ కాసేపు చెప్పులు లేకుండా నడవడం వల్ల మన అవయవాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మనం చెప్పులు ఉపయోగించకుండా నడిచినప్పుడు, మన శరీరంలో శోథ నిరోధక లక్షణాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతాయి. (గమనిక: పైన పేర్కొన్న ఆంశాలు, నివేదికలు, నిపుణుల సమాచారం మేరకు అందిచడ్డాయి. దీనిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించగలరు)




