uppula Raju |
Updated on: Sep 06, 2021 | 3:25 PM
కొసావోలోని ప్రిస్టినాకు చెందిన 33 ఏళ్ల వ్యక్తి 2000 సంవత్సరంలో లాంచ్ అయిన నోకియా 3310 సెల్‌ఫోన్‌ను మింగేశాడు.
కడుపునొప్పితో ఆస్పత్రికి వెళితే స్కానింగ్ చేసిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు. కడుపులో ఫోన్ జీర్ణించుకోలేనంత పెద్దదిగా ఉండటం గమనించారు.
హానికరమైన రసాయనాలు కలిగి ఉన్న బ్యాటరీ ఉండటం వల్ల కడుపులోనే ఫోన్ పేలిపోయే ప్రమాదం కూడా ఉందని వైద్యులు గుర్తించారు.
అదృష్టవశాత్తూ ఆ వ్యక్తికి చేసిన ఆపరేషన్ విజయవంతమైంది. వైద్యులు కడుపు నుంచి ఫోన్ బయటకు తీశారు. కానీ సెల్‌ఫోన్ ఎందుకు మింగాడో మాత్రం చెప్పలేదు.