- Telugu News Photo Gallery Viral photos Viral photos a man in Switzerland has a tattoo on his body and eyes
Viral Photos: ఇతడొక విచిత్రమైన వ్యక్తి.. గ్రహాంతరవాసికేమి తీసిపోడు..!
Viral Photos: ఒకప్పుడు శరీరంపై మాత్రమే టాటూలు వేయించుకునేవారు. కానీ ఇప్పుడు శరీరంపై ఎక్కడ పడితే అక్కడ వేయించుకుంటున్నారు. స్విట్జర్లాండ్‌లోని ఆండ్రియాస్ స్టాఫిగర్ ముఖం
Updated on: Apr 10, 2022 | 3:21 PM

ఒకప్పుడు శరీరంపై మాత్రమే టాటూలు వేయించుకునేవారు. కానీ ఇప్పుడు శరీరంపై ఎక్కడ పడితే అక్కడ వేయించుకుంటున్నారు. స్విట్జర్లాండ్‌లోని ఆండ్రియాస్ స్టాఫిగర్ ముఖం, శరీరంపై అలాగే కళ్ళలో కూడా టాటూలు వేయించుకున్నాడు.

పచ్చబొట్టు కారణంగా 44 ఏళ్ల ఆండ్రియాస్ స్టోఫిగర్ గ్రహాంతరవాసిలా కనిపిస్తున్నాడు. ఆండ్రియాస్ వృత్తిరీత్యా అగ్నిమాపక సిబ్బంది. అయినప్పటికీ టాటూలు వేయించుకోవడానికి చాలా ఇష్టపడతాడు. అతను కొత్త టాటూ వేసుకున్నప్పుడల్లా ఖచ్చితంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫోటోలని షేర్ చేస్తాడు.

డైలీ స్టార్ నివేదిక ప్రకారం.. ఆండ్రియాస్‌కు 18 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు అతను తన శరీరంపై టాటూను వేయించుకోవడం ప్రారంభించాడు. ఈ రోజు అతని శరీరంపై మొత్తం 60 టాటూలు ఉన్నాయి. ప్రస్తుతం అతని కళ్లతో పచ్చబొట్టు ఎక్కువగా చర్చనీయాంశమైంది.

నివేదికల ప్రకారం.. కళ్లలోని తెల్లటి భాగంలో పచ్చబొట్టు వేయడాన్ని స్క్లెరల్ టాటూయింగ్ అంటారు. ఇంజెక్షన్ ద్వారా కంటి లోపల ఇంక్ నింపుతారు. ఇది చాలా ప్రమాదకరమైన పద్దతి. అయినప్పటికీ ఆండ్రియాస్ వేయించుకున్నాడు.

డైలీ స్టార్ ప్రకారం.. ఆండ్రియాస్ ఇప్పుడు తన నాలుకపై విచిత్రమైన రీతిలో టాటూ వేయించుకోవడానికి సిద్ధమవుతున్నాడు. నాలుకను రెండు భాగాలుగా చేసి దానిపై ఊదా, ఆకుపచ్చ రంగు పచ్చబొట్టు వేయించుకుంటానని చెబుతున్నాడు.



