- Telugu News Photo Gallery Viral photos Meet the woman whose record breaking mouth gape went viral on tiktok
World’s biggest mouth: పే…ద్ద నోటితో… గిన్నీస్ బుక్ రికార్డు నెలకొల్పింది
ఆ నోరు ఏంది స్వామి అంత ఉంది... అంటారు ఆమెను చూడగానే.. అవును మీరే కాదు ఆ విషయాన్ని గిన్నీస్ బుక్ వారు కూడా గుర్తించారు. అతిపెద్ద నోరు ఉన్న మహిళ అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కల్పించారు.
Updated on: Jul 29, 2021 | 2:03 PM

టిక్ టాక్ ద్వారా ప్రాచూర్యాన్ని పొందిన 31ఏళ్ల సమంతా రామ్‌స్‌డెల్ తన అతిపెద్ద నోటితో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ కొట్టేసింది. ఈమె అమెరికాలో నివశిస్తోంది.

ఆమె నోరు 6.52 సెంటీమీటర్లు ఉంటుంది. ఆమె దవడ పెద్దగా సాగిపోతుంది. అందుకే గిన్నీస్ బుక్ వారు కొలతలు తీసుకుని, పరిశీలనలు చేసిన అనంతరం ప్రపంచంలోనే అతిపెద్ద నోరు కలిగిన మహిళగా కన్ఫామ్ చేశారు.

కాగా చిన్న వయస్సు నుంచే సామ్ పెద్ద నోరు ఉందని చాలామందికి తెలుసు. ఆమె చిన్ననాటి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఆమె కుటుంబంలో ఎవ్వరికీ కూడా ఇంత పెద్ద నోరు లేదు. సామ్ కు మాత్రమే ఇంత పెద్ద నోరు ఉండటం అందరిలో ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఆమె నోటి గ్యాపులో ఒక ఆపిల్ మొత్తం పట్టేంత పెద్దగా తెరవగలదు. నాలుగు సింగిల్ చీజ్ బర్గర్ లను ఒకేసారి అమాంతం మింగేయగలదు.
